Sunil First Look In Pushpa: ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను లుక్ రిలీజ్.. భయంకరంగా సునీల్

Sunil First Look In Pushpa: 'పుష్ప'(Pushpa Sunil First look) సినిమాలో విలన్​గా నటిస్తున్న సునీల్​ ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్​లో సునీల్​.. సరికొత్త అవతారంలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2021, 12:02 PM IST
Sunil First Look In Pushpa: ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను లుక్ రిలీజ్.. భయంకరంగా సునీల్

Sunil First Look In Pushpa: 'పుష్ప' (Pushpa Sunil First look) సినిమా నుంచి కొత్త అప్డేట్​ వచ్చేసింది. ఇందులో మంగళం శ్రీను అనే విలన్​ పాత్రలో నటిస్తున్న సునీల్​కు సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. "రాక్షసుడి పరిచయం.. మంగళం శ్రీనుగా సునీల్‌" అని వ్యాఖ్య రాసుకొచ్చింది. ఎప్పుడూ కనిపించని సరికొత్త అవతారం మాస్​లుక్​లో​ కనిపించి అభిమానులను భయపెట్టారు సునీల్. నుదుటన బొట్టు, మెడలో చైన్​లు,​ చేతిలో పాత మొబైల్​ ఫోన్​, ఎరుపెక్కిన కళ్లతో ఉన్న ఆయన సీరియస్​ లుక్​ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. 

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న (Pushpa Movie Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Also Read: Lala Bheemla Full Song: పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘లాలా..భీమ్లా’ సాంగ్ వచ్చేసింది! 

Also Read: Marakkar OTT Release Date: రూ.100 కోట్లతో నిర్మించిన నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా.. చివరికి ఓటీటీ రిలీజ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News