Sudeep Divorce: కన్నడ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో సుదీప్ కూడా ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో..నటించిన సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈగ వంటి బ్లాక్ బస్టర్ సినిమా లో కనిపించిన సుదీప్.. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. 2001 అక్టోబర్ 18న ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయిన దాదాపు 14 సంవత్సరాల తర్వాత 2015లో.. ఈ జంట మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దాదాపు అందరూ భార్యాభర్తల్లాగానే.. వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని గొడవలు మొదలయ్యాయి. కానీ అవి విడాకులు దాకా వెళ్ళాయి. కోర్టులో విడాకులు.. ఫైల్ చేశాక కూడా ఈ జంట కలిసే కనిపించింది కానీ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వివాదాలను బయటకు పూర్తిగా తెలియనివ్వలేదు.
ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూలో..మాట్లాడుతున్నప్పుడు కూడా సుదీప్ స్నేహంలో అపార్థాలు వస్తే కొంతకాలం మాట్లాడుకోకుండా ఉంటాము కానీ వివాహంలో అలా అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇది ఏమవుతుంది అనేది.. నాకు తెలియదు అని అన్నారు. ఆ సమయంలో తన కూతురు శాన్వి కస్టడీ విషయాన్ని కూడా తన భార్యకే వదిలేసారు సుదీప్. ఆ సమయంలో విడాకులు.. తీసుకుని ఉంటే సుదీప్ దాదాపు 19 కోట్ల వరకు భరణంగా ఇవ్వాల్సి వచ్చేది. ఏదేమైనా మళ్లీ అన్నీ చక్కబడడంతో వారిద్దరి మధ్య.. పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి.
విడాకుల కోసం దరఖాస్తు చేశారు కానీ.. తమ కూతురు శాన్వి కోసం సుదీప్ తన భార్య ఒకరికి ఒకరు రెండవ అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి మళ్లీ వాళ్ళిద్దరూ విడాకుల..మాట బయటకు రానివ్వలేదు. ఇక 2020లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వారి మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా సుదీప్ తన భార్యతో కలిసి కేక్ కూడా కట్ చేశారు.
Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి