RRR movie: ఆర్ఆర్ఆర్ స్టోరీపై మరోసారి క్లారిటీ

దర్శక దీరుడు జక్కన్న చెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ( RRR movie ) లాక్ డౌన్ తరువాత ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ), మెగా పవర్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Last Updated : Oct 14, 2020, 05:53 AM IST
RRR movie: ఆర్ఆర్ఆర్ స్టోరీపై మరోసారి క్లారిటీ

దర్శక దీరుడు జక్కన్న చెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ( RRR movie ) లాక్ డౌన్ తరువాత ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ), మెగా పవర్ స్టార్ రాంచరణ్ ( Ram Charan ) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం థర్మల్ స్క్రీనింగ్ ( Thermal screening ) తరువాత షూటింగ్ ప్రారంభించారు. అంతే కాకుండా షూటింగ్‌కి సంబంధించిన పరికరాలను కూడా శానిటైజ్ ( Sanitize ) చేసిన తరువాతే షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు మూవీ యూనిట్ ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్పింది. Also read : 800 first look: ముత్తయ్య మురళీధరన్‌ని దించేశారు

అక్టోబర్ 10న జక్కన్న పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక పోస్టర్‌ని విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో అశోక చక్రం లాంటి చక్రంపై రెండు చేతులు కలిసిన ఫొటో ఉంది. ఆ ఫొటో గురించి ఒక అభిమాని 'అల్లూరి సీతా రామరాజు ( Alluri Seetarama Raju ), కొమురం భీం ( Komuram Bheem ) ఇద్దరూ కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు' అని చెప్పడానికి సూచికనే ఈ పోస్టర్ అని కామెంట్ చేశాడు. Also read : Bigg Boss Telugu 4: హారిక జుట్టు కత్తిరించిన కంటెస్టంట్స్

అభిమాని చేసిన ఈ కామెంట్‌కి స్పందించిన ఆర్ఆర్ఆర్ టీమ్.. 'ఆ రెండు చేతులు అల్లూరి సీతా రామరాజు, కొమురం భీం చేతులే.. వాళ్లిద్దరూ కలుస్తారు అనేంత వరకు వాస్తవమే కానీ పైన కామెంట్‌లో చెప్పినట్టుగా ఈ సినిమాలో వాళ్లు స్వాతంత్య్రం కోసం పోరాటం చేయరు. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం కల్పిత కథ ( Fictional movie), దేశభక్తి సినిమా కాదు' అని సమాధానం ఇచ్చారు. Also read : Renu Desai tv entry: టెలివిజన్ ఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ

అందరూ భావించినట్లుగా ఆర్ఆర్ఆర్ సినిమా దేశ భక్తి సినిమా ( Patriotic movie ) కాదు, ఫిక్షనల్ మూవీ అని ఈ రిప్లై ద్వారా రాజమౌళి మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఇంతకి ఈ సినిమా కథ ఎంటో తెలియాలంటే.. ఆర్ఆర్ఆర్ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చే వరకు వేచిచూడాల్సిందే మరి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News