SS Rajamouli safari tour: మొక్కు తీర్చుకుని సఫారి టూర్ ఎంజాయ్ చేసిన రాజమౌళి దంపతులు

ఎస్.ఎస్.రాజమౌళి, ఆయన భార్య రామ రాజమౌళి తాజాగా కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ( Bandipur Tiger Reserve forest ) పర్యటించారు. మూడు రోజుల షార్ట్ వెకేషన్‌లో ( Short vacation ) భాగంగా కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఈ దంపతులు అలా అలా పర్యాటక ప్రదేశాలను చుట్టొచ్చారు.

Last Updated : Sep 18, 2020, 02:00 AM IST
  • మూడు రోజుల షార్ట్ వెకేషన్‌లో భాగంగా పశ్చిమ కనుమలను అలా చుట్టేసొచ్చిన రాజమౌళి దంపతులు.
  • మొక్కు తీర్చుకున్న అనంతరం సఫారీ టూర్ ఎంజాయ్ చేసిన రాజమౌళి.
  • త్వరలోనే RRR మూవీ షూటింగ్‌కి ప్లాన్ చేసుకుంటున్న రాజమౌళి
SS Rajamouli safari tour: మొక్కు తీర్చుకుని సఫారి టూర్ ఎంజాయ్ చేసిన రాజమౌళి దంపతులు

ఎస్.ఎస్.రాజమౌళి, ఆయన భార్య రామ రాజమౌళి తాజాగా కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ( Bandipur Tiger Reserve forest ) పర్యటించారు. మూడు రోజుల షార్ట్ వెకేషన్‌లో ( Short vacation ) భాగంగా పశ్చిమ కనుమలలో ఈ దంపతులు బుధవారం ఉదయం చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట తాలూకా టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే పురాతన హిమావాడ్ గోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి వాళ్ల మొక్కు తీర్చుకున్నారు. పూజారి గోపాల కృష్ణ భట్ పూజలు నిర్వహించి, దంపతులు ఇద్దరిని శాలువాతో సత్కరించారు. Also read : T cells immunity: కరోనావైరస్ తిక్క కుదిర్చే కణాలు ఇవే

రాజమౌళి, రమా రాజమౌళి ( SS Rajamouli couple ) దేవుడిని దర్శించిన అనంతరం అలాగే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పచ్చదనం, నిర్మలమైన పరిసరాలను ఆస్వాదిస్తూ అలా అలా విహరించి వచ్చారు. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని సెరాయ్ రిసార్ట్‌లో మంగళవారం నుండి గురువారం వరకు దంపతులు ఇద్దరూ బస చేశారు. అక్కడి నుంచే రిసార్ట్స్‌కి సమీపంలోని అందమైన ప్రాంతాలన్ని చుట్టేసి వచ్చారట. Also read :Rang De movie: ఆర్జీవీ చిత్రాల తరహాలోనే రంగ్ దే ?

కరోనావైరస్ ( Coronavirus ) నుండి కోలుకున్న తరువాత, రాజమౌలి, భార్య రమ ఇటీవల ప్లాస్మా డొనేషన్ ప్రచారంలో పాల్గొని, కరోనా మహమ్మారి నుండి బయటపడిన వారందరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం ( Plasma donation ) చేయాలని కోరిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత, రాజమౌళి తన తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రమ్ రణం రుధిరమ్) ( RRR movie ) షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. Also read : Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News