Srikanth: శ్రీకాంత్ కొడుకుని కిడ్నాప్ చేసిన ఎన్టీఆర్.. ఫైనల్ గా బయటపడిన విషయం

Devara: శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అనేక రకాల పాత్రలు చేసి తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటులలో ఈయన ఒకరు. అలాంటి శ్రీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం చెప్పిన ఒక సంఘటన అందరినీ ఆకట్టుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2023, 06:11 PM IST
Srikanth: శ్రీకాంత్ కొడుకుని కిడ్నాప్ చేసిన ఎన్టీఆర్.. ఫైనల్ గా బయటపడిన విషయం

Jr NTR: ఏ పాత్రలోనైనా అలరించగలిగే అతి కొద్ది మంది హీరోల్లో శ్రీకాంత్ ఒకరు. మొదట్లో విలన్ క్యారెక్టర్లు చేసిన ఆయన పెళ్లి సందడి సినిమాతో సాఫ్ట్ హీరోగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ తరువాత ఎన్నో ఫ్యామిలీ చిత్రాలలో కనిపించిన శ్రీకాంత్ మంచి హీరోగా పేరు సాధించారు. కాగా ఈ మధ్య హీరో పాత్రల నుంచి బయటకు వచ్చి మరల విలన్ క్యారెక్టర్లు కొన్ని సపోర్టింగ్ రోల్స్ లో కనిపించి మెప్పిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ అఖండాలో చేసిన భయంకరమైన విలన్ పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఆయనలోని వేరే కోణాన్ని పరిచయం చేసింది.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలుగా రాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ అలానే జూనియర్ ఎన్టీఆర్ దేవరా చిత్రాల్లో కూడా శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటిచ్చిన శ్రీకాంత్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక అల్లరి పనిని బయటపెట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు శ్రీకాంత్.

తారక్ ఎక్కడ ఉంటే అక్కడ గొడవ గొడవగా ఉంటుందన్నారు శ్రీకాంత్. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి తన తెరంగేత్రం చేయకముందు శ్రీకాంత్ ఇంటి పక్కనే ఉండేవారట. కాగా ఒకరోజు శ్రీకాంత్ కొడుకు రోషన్‌ను ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లిపోయాడంట మన హీరో.  శ్రీకాంత్ కుటుంబం మొత్తం రోషన్ చాలా సేపు కనిపించకపోవడంతో గగ్గోలు పడిపోయారంట. అన్నిచోట్ల వెతుకులాట మొదలుపెట్టారట. ఇక కొద్దిసేపు తర్వాత అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఏంటి బాబాయ్ వెతుకుతున్నావ్ అని శ్రీకాంత్ ని అడగి.. వెంటనే రోషన్ తన దగ్గరే ఉన్నాడని చాలా కూల్ గా చెప్పారట. ఇలా తన కొడుకుని జూనియర్ ఎన్టీఆర్ కిడ్నాప్ చేసిన సంగతి గుర్తు చేసుకుంటూ చెప్పుకోచ్చారు శ్రీకాంత్. అలానే జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ పర్సన్ ని తాను ఎప్పుడూ చూడలేదని కూడా అన్నారు.

కాగా ప్రస్తుతం శ్రీకాంత్ ముఖ్యపాత్రలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాని కొరతాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తరువాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో విశేషం ఏమిటి అంటే ఈ సినిమా రెండు భాగాలుగా పాన్ ఇండియా పరంగా విడుదల కానుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News