శ్రీదేవి జిరాక్స్ కాపీ.. అచ్చం అమ్మలాగే ఉంది..!

  

Last Updated : Nov 16, 2017, 04:33 PM IST
శ్రీదేవి జిరాక్స్ కాపీ.. అచ్చం అమ్మలాగే ఉంది..!

టాలీవుడ్, బాలీవుడ్ చిత్రసీమలను ఏలిన అందాలరాశి  శ్రీదేవి కుమార్తె జాహ్నవి కూడా ఇక వెండితెరపై తన లక్ పరీక్షించుకోనున్నారు. ఆమె తెరంగేట్రం గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వెలువడ్డాయి. అయితే ఎటువంటి పబ్లిసిటీ లేకుండానే ఈ రోజు జాహ్నవి తొలి చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు నిర్మాతలు. దాంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ సినిమాకి ‘ధడక్‌’ అనే పేరు ఖరారు చేశారు. లో బడ్జెట్ చిత్రంగా విడుదలై, ఘన విజయం సాధించిన మరాఠీ చిత్రం ‘సైరాత్‌’కు ఇది హిందీ రీమేక్. ఈ ఫస్ట్‌లుక్‌ చూసిన చాలామంది జాహ్నవి అచ్చం తన తల్లి శ్రీదేవిలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

అందమైన కళ్లు, కళ ఉన్న ముఖంతో జాహ్నవి తన అమ్మకు తగ్గ కూతురిగానే కనిపించారని నెటిజన్లు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్లు సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది జాహ్నవికి ఆల్ ది బెస్ట్ చెబుతూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ధర్మా ప్రొడక్షన్స్‌, జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  ఇందులో జాహ్నవి సరసన హీరో షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ ఖత్తర్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Trending News