Sreemukhi Latest Photos: పొట్టి డ్రస్సులో కైపెక్కిస్తున్న బుల్లితెర బ్యూటీ శ్రీముఖి.. పోజులు మామూలుగా లేవుగా!

Sreemukhi Latest Photos: శ్రీముఖి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన యాంకరింగ్ తో పాటు తన కామెడీ పంచ్ లతో అలరిస్తుంటుంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పొట్టి డ్రస్సులో తీసిన ఫొటోషూట్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 07:42 AM IST
Sreemukhi Latest Photos: పొట్టి డ్రస్సులో కైపెక్కిస్తున్న బుల్లితెర బ్యూటీ శ్రీముఖి.. పోజులు మామూలుగా లేవుగా!

Sreemukhi Latest Photos: చిలిపి చేష్టలతో, గలగలా మాటలతో అటు యాంకర్​గా, ఇటు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది  శ్రీముఖి. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోన్న ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్​గా ఉంటోంది. తరచూ ఫొటోలు పెడుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఈ భామ షేర్ చేసిన కొన్ని షార్ట్ డ్రస్సు ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.  

బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. వరుస ఫొటోషూట్ లతో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. శ్రీముఖి టీవీ రంగంలో మంచి క్రేజ్‌ ఉంది. స్పెషల్‌ షోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన యాంకర్ శ్రీముఖి.. కామెడీ షోలకు తన పర్‌ఫెక్ట్ యాప్ట్ అని చెప్పొచ్చు.

యాంకర్ గా పాపులర్

ఈటీవీలో 'పటాస్' షో తో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి.. ఆ తర్వాత మాటీవీ, జీ తెలుగు ఇలా అన్నింటిలోనూ ఏదో ఒక షో చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక ఆమె ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తుంది. కమెడియన్లతో పాటు ఆమె కూడా తనదైన పంచ్ లు వేస్తూ.. ప్రేక్షకులను నవ్విస్తోంది.

హీరోయిన్ గా ఎంట్రీ
వెండితెరపై ఇటీవలే విడుదలైన 'క్రేజీ అంకుల్స్' సినిమాతో హీరోయిన్ గా శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా తెరకెక్కిన 'అంధాధున్' రీమేక్ 'మాస్ట్రో' సినిమాలో శ్రీముఖి కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషనలో రూపొందుతోన్న 'భోళాశంకర్' సినిమాలోనూ కీలకపాత్ర కోసం ఎంపికైంది. 

శ్రీముఖి.. తాజాగా ఓ కార్‌, బైక్‌ రైడ్‌ యాప్‌ ఓపెనింగ్‌లో పాల్గొని సందడి చేసింది. మొత్తంగా శ్రీముఖి బుల్లితెర, వెండితెరతో పాటు ‘లువా’ పేరిట బ్రాండ్ ఫ్యాషన్ స్టోర్ స్టార్ చేసి బిజినెస్ ఉమన్‌గానూ రాణిస్తోంది. 

ఆమె తనకు సంబంధించిన హాట్ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. తన పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. షార్ట్ డ్రస్సులో అందాలను ఆరబోస్తూ ఉన్న ఫొటోలను శ్రీముఖి పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు హాట్‌ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు శ్రీముఖి ఫోటోలను షేర్‌ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. 

Also Read: Unstoppable With NBK: పుష్పరాజ్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య- 'తగ్గేదేలే' అంటున్న బన్నీ

Also Read: Shyam Singha Roy Review: 'శ్యామ్ సింగరాయ్'గా హీరో నాని మెప్పించాడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News