Sreekaram Trailer: శ్రీకారం ట్రైలర్.. రైతుల జీవితం గురించే

Sharwanand's next movie Sreekaram Trailer: శర్వానంద్ హీరోగా విడుదలకు రెడీ అయిన శ్రీకారం మూవీ ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. మార్చి 11న Sreekaram movie release కానుండంతో పాటు మార్చి 6న Sharwanand Birthday కూడా అవడంతో అంతకంటే ఒక రోజు ముందే మేకర్స్ Sreekaram Trailer ను విడుదల చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2021, 12:40 AM IST
  • Maha Shiv ratri 2021 కానుకగా మార్చి 11న విడుదల కానున్న Sreekaram movie.
  • వ్యవసాయంపై మరో Message oriented movie.
  • శర్వానంద్ హీరోగా దర్శకుడు బి కిషోర్ చేసిన మరో ప్రయోగం.
Sreekaram Trailer: శ్రీకారం ట్రైలర్.. రైతుల జీవితం గురించే

Sharwanand's next movie Sreekaram Trailer: శర్వానంద్ హీరోగా విడుదలకు రెడీ అయిన శ్రీకారం మూవీ ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. Maha Shiv ratri 2021 కానుకగా మార్చి 11న Sreekaram movie release కానుండగా, మార్చి 6న Sharwanand Birthday కూడా అవడంతో అంతకంటే ఒక రోజు ముందే అయిన మార్చి 5న నిర్మాతలు Sreekaram Trailer ను విడుదల చేశారు. బి కిషోర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. శ్రీకారం మూవీ ద్వారా దర్శకుడు కిషోర్ కూడా మహర్షి, భీష్మ చిత్రాల తరహాలోనే మరోసారి వ్యవసాయం, రైతన్నల బతుకుచిత్రంపై దృష్టి సారించాడని Sreekaram Trailer చూస్తే అర్థమవుతోంది. 

Watch Sreekaram teaser : Sreekaram Teaser: Farmer పాత్రలో శర్వానంద్.. ఆసక్తి రేకెత్తిస్తున్న dialogues..

Janu movie తర్వాత శర్వానంద్ చేస్తోన్న సినిమా ఇదే. Software engineer నుంచి Farmer గా శర్వానంద్ మారడానికి వెనుకున్న బలమైన కారణం ఏంటి అని ఆసక్తి రేకెత్తించేలా మేకర్స్ Sreekaram trailer ను కట్ చేశారు. శర్వానంద్ సరసన Actress Priyanka Arul Mohan జంటగా నటించింది. ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం. సేద్యాలు కూడా గెలవొచ్చు అనే డైలాగ్ వింటుంటే.. వ్యవసాయం గురించి ఈ సినిమాలో ఇంకెంత బాగా చెప్పి ఉంటాడోనని అనిపించకమానదు. ఏదేమైనా శ్రీకారం సినిమా ఎలా ఉందో తెలియాలంటే Sreekaram movie release date వరకు ఆగాల్సిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News