Sarkaru Vaari Paata Movie: మహాశివరాత్రి స్పెషల్... మహేశ్ 'సర్కారు వారి పాట' నుంచి పోస్టర్ రిలీజ్

Sarkaru Vaari Paata Movie: ఫ్యాన్స్ కు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపింది 'సర్కారు వారి పాట' చిత్రబృందం. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 01:08 PM IST
Sarkaru Vaari Paata Movie: మహాశివరాత్రి స్పెషల్... మహేశ్ 'సర్కారు వారి పాట' నుంచి పోస్టర్ రిలీజ్

Sarkaru Vaari Paata Movie Update: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న చిత్రం "సర్కారు వారి పాట" (Sarkaru Vaari Paata Movie). పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన కళావతి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ చిత్రాన్ని  మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

తాజాగా మహాశివరాత్రి (Maha Shivratri 2022) పర్వదినాన్ని పురస్కరించుకుని.. పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మహేశ్.. విలన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక కథ విషయానికొస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ స్కామ్ చుట్టూ తిరుగుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ కూడా ఉంటుందట. ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటర్.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Also Read: Bheemla Nayak Collection: రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

 

Trending News