Samantha Ruth Prabhu Busy: సమంత దెబ్బ.. 'ఖుషీ' పక్కన పెట్టి ముందుకు వెళ్తోన్న శివ నిర్వాణ!

Siva Nirvana Next Project: సమంత రుత్ ప్రభు ఎప్పుడు వస్తుందో తెలియని నేపధ్యంలో శివ నిర్వాణ ఖుషీ విషయం పక్కన పెట్టి తరువాతి సినిమా మీద ద్రుష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 30, 2023, 11:43 AM IST
Samantha Ruth Prabhu Busy: సమంత దెబ్బ.. 'ఖుషీ' పక్కన పెట్టి ముందుకు వెళ్తోన్న శివ నిర్వాణ!

Siva Nirvana in Plans to Proceed to Next Project: లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే సినిమా చేస్తున్నాడు. సమంత రూత్ ప్రభు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కాశ్మీర్ నేపద్యంలో సాగే ఒక అందమైన ప్రేమ కథ అని ఇప్పటికీ అందరికీ క్లారిటీ వచ్చేసింది. సైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొత్త మేర పూర్తయింది. అయితే సమంత రూత్ ప్రభు అనూహ్యంగా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటంతో ఆమె ఈ సినిమా షూటింగ్ కి డుమ్మా కొట్టింది.

అనారోగ్య పరిస్థితులు కావడంతో ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఆమెను ప్రెజర్ చేయలేకపోతున్నారు. అయితే అంతా సెట్ అయిన వెంటనే మీ దగ్గరికి ముందు వచ్చి షూటింగ్ పూర్తి చేస్తానని మాట ఇచ్చిన సమంత ప్రస్తుతానికి వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ముంబైకి వెళ్ళిపోయింది. ఆమె అక్కడ నుంచి ఎప్పుడు తిరిగి వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖుషీ దర్శకుడు శివ నిర్వాణ ఏం చేయాలో పాలు పోనీ నేపథ్యంలో తన నెక్స్ట్ సినిమా మీద దృష్టి పెట్టినట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. ఆయన హీరో నితిన్ కలిసి ఇప్పటికే కథ వివరించినట్లుగా చెబుతున్నారు.

అయితే నితిన్ నుంచి కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా శివ నిర్వాణ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేమిటంటే సమంత రూత్ ప్రభు కనుక మార్చి మొదటి వారానికి కూడా షూట్ లో హాజరు కాకపోతే తాను ఇంకా వెయిట్ చేసి అనవసరమని ఆవిడ వచ్చినప్పుడే షూటింగ్ చేసుకోవచ్చు ఈలోపు వేరే ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్లాన్ లో ఆయన ఉన్నారని తెలుస్తోంది.

దాదాపుగా అది నితిన్ సినిమానే అవుతుందని అంటున్నారు. నితిన్ ప్రస్తుతానికి వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయిన వెంటనే శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ సమంత మాత్రం శివ నిర్వాణ అండ్ టీం మొత్తాన్ని కన్ఫ్యూజన్లో పడేసిందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది

Also Read: Taraka Ratna Latest Health Update: కాసేపట్లో తారకరత్నకు కీలక వైద్యపరీక్షలు.. ఆ తరువాత హెల్త్ బులెటిన్ విడుదల

Also Read: Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరో.. రుణపడి ఉంటామంటున్న అభిమానులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News