Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్

Sita First Look From Prabhas Adipurush ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ చిత్రయూనిట్ పెంచేసింది. వరుసగా అప్డేట్లు ఇస్తోంది. హనుమాన్, రాముడు ఇలా అన్ని పాత్రలకు సంబంధించిన లుక్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు సీతకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2023, 08:58 AM IST
  • నెట్టింట్లో ఆదిపురుష్ ట్రెండ్
  • సీతానవమి స్పెషల్ అప్డేట్
  • సీతగా కృతి సనన్ ఫస్ట్ లుక్
Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్

Sita First Look From Prabhas Adipurush ఓం రౌత్ ప్రభాస్ కాంబోలో రాబోతోన్న ఆదిపురుష్‌ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇక ఆదిపురుష్‌ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచేశారు. సీతానవమి సందర్భంగా ఆదిపురుష్‌ నుంచి సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇక అశోక వనంలో సీత బాధపడుతున్న సందర్భంలోని లుక్‌ను విడుదల చేసినట్టుగా అనిపిస్తోంది. సీతగా కృతి సనన్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ మెప్పిస్తోంది.

ఆదిపురుష్ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూనే వస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం నాసిరకమైన వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ వల్ల వాయిదాలు పడుతూనే వస్తోంది. టీజర్‌లో ఉన్న విజువల్స్, గ్రాఫిక్స్‌కు జనాలు పెదవి విరిచారు. దీంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ గ్రాఫిక్స్‌ను, విజువల్స్‌ను కాస్త బెటర్‌ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అందులో ఎలాంటి మార్పులు రానట్టుగా కనిపిస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News