Singer Sunitha recovered corona: కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) నిత్యం విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. వైరస్ సోకుతూనే ఉంది. ఇటీవల గాయని సునీత సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సునీత అభిమానులు ఆమె అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా సునీత ( Sunitha ) అభిమానులకు శుభవార్త చెప్పారు. కరోనా నుంచి ఆమె కోలుకున్నట్లు ఆమె వీడియోను విడుదల చేశారు. డాక్లర్లు సలహాలు, సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండి కరోనా నుంచి కోలుకున్నట్టు సునీత తెలిపారు. చిన్నపాటి తలనొప్పి రాగా కరోనావైరస్ పరీక్ష చేయించుకుంటే.. పాజిటివ్‌గా నిర్థారణ అయిందని, ఆ తర్వాత హోం ఐసోలేషన్‌లో ఉంటూ..వైద్యుల సలహాలతో త్వరగా కోలుకున్నట్టు వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన అభిమానులకు సునీత ధన్యవాదాలు తెలియజేశారు. Also read: Sushant death case: కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు
దీంతోపాటు గాయని సునీత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాల సుబ్రహ్మణ్యం, ఆయన కుటుంబసభ్యులు ఆనందంగా ఉండాలని కుటుంబమంతా ప్రార్థిస్తున్నట్లు ఆమె ఫెస్బుక్ ద్వారా విడుదల చేసిన వీడియోలో వెల్లడించారు. Also read: Healh Tips: పరిగడుపున వెల్లుల్లి తినడం వల్ల లాభాలు తెలుసా..?