Mangli Shiva Ratri Song : మంగ్లీ పాటపై వివాదం.. గుడిలో గుట్టుచప్పుడు కాకుండా

Mangli Shiva Ratri 2023 Song ఈ ఏడాది మహా శివరాత్రి సందర్భంగా మంగ్లీ శివుడి పాటను చేసింది. ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది కూడా మంగ్లీ తన గొంతుతో శివ భక్తులను ఆకట్టుకుంది. అయితే శ్రీకాళహస్తిలో ఈ పాటను షూట్ చేయడం ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 12:55 PM IST
  • మళ్లీ వివాదంలో చిక్కుకున్న మంగ్లీ
  • శివరాత్రి పాట చిత్రీకరణపై జనాగ్రహం
  • సింగర్ మంగ్లీకి తప్పని తిప్పలు
Mangli Shiva Ratri Song : మంగ్లీ పాటపై వివాదం.. గుడిలో గుట్టుచప్పుడు కాకుండా

Mangli Shiva Ratri 2023 Song ప్రతీ ఏడాది సింగర్ మంగ్లీ నోటి నుంచి శివుడి పాట వస్తూనే ఉంటుంది. మహా శివరాత్రికి మంగ్లీ పాడిన పాటలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ ఏడాది సైతం మంగ్లీ ఓ పాటను చేసింది. ఆ పాటను సుద్దాల అశోక్ తేజ్‌ రచించాడు. అయితే ఇప్పుడు ఈ పాట వివాదంలో చిక్కుకుంది. తిరిగి తిరిగి మళ్లీ మంగ్లీ పేరు వైరల్ అవుతోంది. శ్రీకాళహస్తిలోని కాలభైరవస్వామి ఆలయంలో పాటను ఎలా షూట్ చేస్తారు.. అనుమతి లేదు కదా? అని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలోని కాలభైరవస్వామి విగ్రహం వద్ద నృత్యం చేసిన విజువల్స్ ఆ పాటలో ఉన్నాయి. ముక్కంటి ఆలయంలో మంగ్లీ ఆటాపాటలు ఇప్పుడు వివాదానికి దారి తీస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరించి యూట్యూబ్లో విడుదల చేయడం మీద ఇప్పుడు అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. మామూలుగా అయితే అక్కడ గత రెండు దశాబ్దాలుగా అనుమతి లేదని, అయినా ఎలా షూట్ చేశారంటూ నిలదీస్తున్నారు.

దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగ్లీ శివుడి పాటను చిత్రీకరించింది. ప్రతీ ఏటా ఓ శివుడి పాటతో మంగ్లీ అందరినీ పలకరిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది శ్రీకాళహస్తిలోని ఆలయంలో పాటను చిత్రీకరించింది. ఈ ఆలయంలో రెండు దశాబ్దాల నుంచి వీడియో చిత్రీకరణకు అనుమతించడం లేదు కానీ మంగ్లీ మాత్రం ఇలా పాటను షూట్ చేసింది. 

 

గుట్టుచప్పుడు కాకుండా ముక్కంటి ఆలయం లోపల పాటను చిత్రీకరించి యూట్యూబ్లో విడుదల చేయడంతో శ్రీకాళహస్తివాసులు నివ్వెరపోయారు. ముక్కంటి ఆలయంలోని స్వామివారి సన్నిధి నుంచి నటరాజస్వామి విగ్రహం వరకు మధ్యలో ఉన్న ప్రదేశంలో మంగ్లీ నృత్యం చేసినట్టుగా ఆ ఆల్బమ్‌లో కనిపిస్తోంది. 

కాలభైరవస్వామి విగ్రహం వద్ద, అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మధ్యభాగంలోనూ డ్యాన్స్ చేసింది. ఊంజల సేవా మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చే చోట మంగ్లీ మరో ఇద్దరు యువతులతో కలిసి నృత్యం చేసింది. ఆ పక్కనే ఉన్న రాయలవారి మండపం, రాహుకేతు మండపంలలో కూడా చాలా సేపు వీడియో చిత్రీకరించినట్టు కనిపిస్తోంది. రోజూ సాయంత్రం 6 గంటలకు రాహుకేతు పూజలు ముగిసిన తరువాత మండపాన్ని మూసివేస్తారు. మంగ్లీ నృత్యం చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా మండపాన్ని తెరిచి సహకరించినట్లు సమాచారం అందుతోంది.

Also Read:  Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్

Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News