Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ కి బదులుగా మరో హీరో.. కమల్ హాసన్ సినిమాకి సైతం నో!

Kamal Haasan : ఎన్నో దశాబ్దాల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ నటించాల్సిన ఒక కీలక పాత్ర ఇప్పుడు శింబుకి లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2024, 11:23 AM IST
Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ కి బదులుగా మరో హీరో.. కమల్ హాసన్ సినిమాకి సైతం నో!

Thug Life : 2022 లో విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న లోకనాయకుడు కమల్ హాసన్ చేతిలో ఇప్పుడు మరికొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో పాటు థగ్ లైఫ్ అనే సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. 

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. జయం రవి, త్రిష కృష్ణన్, అభిరామి, నాజర్, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

1987లో విడుదలై కల్ట్ బ్లాక్ బస్టర్ అయిన నాయకన్ (తెలుగులో నాయకుడు) సినిమా తర్వాత మళ్లీ మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత విడుదల కాబోతున్న సినిమా ఇది. ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ కు ప్రేక్షకులకి నుంచి మంచి ఆదరణ లభించింది

నిజానికి ఈ సినిమాలో ప్రముఖ మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్న దుల్కర్ కు డేట్ లు కుదరకపోవడంతో ఈ సినిమాకి నో చెప్పాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇలా కమల్ హాసన్ సినిమాకి సైతం నో చెప్పడంతో ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఆ పాత్ర కోసం శింబు ని సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిన శింబు ఇప్పుడు ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతున్నారట.

అలా దుల్కర్ సల్మాన్ నటించాల్సిన కమల్ హాసన్ సినిమా లోని పాత్ర శింబు వద్దకు చేరింది. కమల్ హాసన్, మణిరత్నం లతో కలిసి పని చేయటం కూడా శింబు కి ఇదే మొదటిసారి. ఈ మధ్యనే మానాడు వంటి సూపర్ హిట్ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన శింబు ఈ సినిమాకి కూడా బాగా ప్లస్ అవుతారని చెప్పుకోవచ్చు.

రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. చెన్నై తో పాటు మరికొన్ని ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Also read: Perni Nani: దొంగలు దొంగలు కూడబలుక్కున్నట్టు 'మోదీ, చంద్రబాబు, పవన్' కలయిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News