Siddhu Jonalagadda in Mr Bachchan: రవితేజ హీరోగా చేసిన.. షాక్ సినిమా ద్వారా.. దర్శకుడిగా పరిచయమయ్యారు హరీష్ శంకర్. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. దర్శకత్వం పరంగా.. హరిష్ శంకర్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకే తన మొదటి చిత్రం.. ఫ్లాప్ ఇచ్చినప్పటికీ.. రవితేజ వెంటనే మరో చిత్రానికి హరీష్ శంకర్ కి ఛాన్స్ ఇచ్చారు.
హరిష్ శంకర్ ఆ తరువాత రవితేజని హీరోగా పెట్టి.. మిరపకాయ అనే సినిమా చేశారు. ఆ సినిమా రవితేజ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది మ. ఇక అప్పటి నుంచి హరీష్ శంకర్ తీసిన సినిమాలు వరుస విజయాలు.. సాధిస్తూ వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్లాప్ లో ఉన్న సమయంలో.. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించారు హరిశంకర్..
రీమేక్స్ కి తన మాస్ టచ్ ఇచ్చి.. సూపర్ హిట్ లు అందుకోవడంలో హరీష్ శంకర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ఈ దర్శకుడు ఇప్పుడు.. మరో హిందీ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. అదే మిస్టర్ బచ్చన్. అజయ్ దేవకగన్ నటించి మంచి విజయం.. సాధించిన రైడ్ సినిమాకి రీమేక్ గా ..మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. ఈరోజు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే.. సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి.. పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన.. పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో ఇద్దరు స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇందుకు.. సంబంధించిన వార్త అందరిని ఆకట్టుకుంటోంది. డీజే టిల్లు సినిమాతో స్టార్ బాయ్ గా మారిపోయిన సిద్ధు జొన్నలగడ్డ సెకండ్ హాఫ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి ఓ ఫైట్ చేసి.. కొన్ని డైలాగ్స్ తో అదరగొట్టాడు. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా.. నిలిచింది.
సిద్దు జొన్నలగడ్డ స్క్రీన్ మీద కనిపించినప్పుడు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అయితే సిద్దు ఈ సినిమాలో ఉన్నారు.. అని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తూనే వచ్చాయి ఇక ఈ హీరో గురించి పక్కన పెడితే వేరే సెలబ్రిటీ కూడా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు.. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరు అంటే రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్. ఈ సినిమా పాటలో.. కాసేపు కనిపించి మాయమయ్యారు. ఇక ఆయన కనిపించినప్పుడు కూడా థియేటర్స్ లో అందరూ విజిల్స్ వేయసాగారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఇచ్చిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం. మొత్తానికి వీరిద్దరి గెస్ట్ అప్పియరని సినిమాకి హైలైట్ గా నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter