Chinna Movie OTT: ఓటీటీలోకి రాబోతున్న సిద్ధార్థ్‌ 'చిన్నా'... స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Chinna Movie OTT: హీరో సిద్ధార్థ్‌ నయా మూవీ చిన్నా’. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సాలిడ్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 06:41 PM IST
Chinna Movie OTT: ఓటీటీలోకి రాబోతున్న సిద్ధార్థ్‌ 'చిన్నా'... స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Chinna Movie OTT: చాలా రోజుల తర్వాత తెలుగులో చిన్నా సినిమాతో హిట్ కొట్టాడు సిద్ధార్థ్‌. ఈ మూవీ రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అక్టోబర్‌ 6న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్నా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించింది హీరో సిద్ధార్థ్‌ కావడం విశేషం. ఈ మూవీకి ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. అరుణ్ కుమార్.. చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్‌ వంటి సున్నితమైన అంశాలను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఇందులో నటీనటులు ఎమోషన్ ను బాగా పండించారు. ఈ చిత్రంలో నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిన్నా మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ దక్కించుకుంది. ఈ నెల చివరి వారంలో ఈ మూవీ  స్ట్రీమింగ్‌ కు రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. చిన్నా సినిమాకు విశాల్ చంద్రశేఖర్, దిబు నినన్ థామస్, సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు. బాలాజీ సుబ్రమణ్యం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తే.. సురేష్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు చూసుకున్నారు. థియేటర్లలో మిస్ అయినా వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

గతంలో టాలీవుడ్ లో సిద్ధార్ధ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో ఫ్యామిలి ఆడియెన్స్ తోపాటు యూత్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, లవ్ ఫెయిల్యుర్ వంటి సినిమాలు ఈయనకు తెలుగులో మంచి గుర్తింపునిచ్చాయి. రీసెంట్ గా ఈయన నటించిన మహాసముద్రం, టక్కర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తాజాగా చిన్నా సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు సిద్దార్థ్.

Also read: Tiger 3 Trailer: యాక్ష‌న్ మోడ్‌లో సల్మాన్.. ఇంట్రెస్టింగ్ గా 'టైగర్ 3' ట్రైలర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News