Dostan Movie : దోస్తాన్ కథ, కథనాలు ఏంటంటే?

Dostan Movie Review రొటీన్ కమర్షియల్ చిత్రాలు కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ వంటి సమస్యలను ఎత్తి చూపుతూ వచ్చిన చిత్రం దోస్తాన్. మరి ఈ సినిమా ఆడియెన్స్‌కు ఏ మేరకు నచ్చుతుందో ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 04:33 PM IST
Dostan Movie : దోస్తాన్ కథ, కథనాలు ఏంటంటే?

సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం దోస్తాన్. ఈ మూవీని శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై  సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం నుండి విడుదలైన  పాటలకు, టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చింది. మొత్తానికి ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. 

స్టోరీ ఏంటంటే?..
ఈ కథ అంతా కూడా వైజాగ్‌లో జరుగుతుంది. సిటీలో భాయ్ (చంద్రసే గౌడ) అనే వ్యక్తి  డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్ వంటి అక్రమ వ్యాపారాలు చేస్తూ బడా బాబుగా చలామణి  అవుతుంటాడు. అలాంటి వాడు గతంలో చెట్టు కింద చంటి బిడ్డకు పాలు ఇస్తున్న నిస్సహాయరాలైన ఓ తల్లిని తన గ్యాంగ్ తో రేప్ చేసి చంపేస్తాడు. అక్కడే ఉన్న మరో అనాథ జై (కార్తికేయ) ఆ చంటి బిడ్డ ఏడుపు వినిపించి చూడగా అక్కడ ఆ పిల్లాడి తల్లి చనిపోయి ఉంటుంది. తన లాగే అనాథగా ఉన్న పిల్లాడిని చేరదీస్తాడు. 

పిల్లాడి పాలకోసం వీధిలో అడుక్కుంటున్న జైని చూసి మెకానిక్ షెడ్ ఓనర్ బాబా (రమణ మహర్షి ) వారిద్దరినీ చేరదీస్తాడు. మెకానిక్ పని నేర్పిస్తాడు. వారికి జై (కార్తికేయ), రామ్ (సిద్ స్వరూప్) అనే పేర్లు పెడతాడ. బాబా చనిపోవడంతో జైని చదువుకోమని చెప్పి రామ్ మెకానిక్‌గానే కంటిన్యూ అవుతాడు. ఈ క్రమంలో జైకి నిత్య (ప్రియ వల్లబి) పరిచయం అవ్వగా, రామ్ (సిద్ స్వరూప్)కి రియా (ఇందు ప్రియ) పరిచయం అవుతుంది. ఆ పరిచయం  కాస్తా ప్రేమగా మారుతుంది. హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి  మళ్ళీ భాయ్ ప్రవేశిస్తాడు. ఆ భాయ్ వల్ల జై, రామ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరికి భాయ్ పై వీరిద్దరూ ఎలాంటి రివేంజ్ తీర్చుకొన్నారు? అనేది దోస్తాన్ కథ.

ఎవరెలా చేశారంటే?..
జై పాత్రలో  కార్తికేయ , రామ్ పాత్రలో  సిద్ స్వరూప్‌లు హీరోగా  నటించిన వీరు.. కొత్త వారైనా ఎమోషన్, లవ్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని రకాలుగా చక్కటి పెర్ఫార్మన్స్ చూపించారు. త‌మదైన న‌ట‌న‌తో  అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. హీరోయిన్స్‌గా నటించిన నిత్య, రియా పాత్రలలో  ఇందు ప్రియ, ప్రియ వల్లబి అందంగా కనిపించారు.చక్కగా నటించారు. భాయ్ పాత్రలో నటించిన చంద్రసే గౌడ నెగటివ్‌ షేడ్‌ పాత్రలో ఆకట్టుకున్నాడని. మిగిలిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే?..
మత్తు పదార్థాలు, మహిళల అక్రమ రవాణా వంటి సున్నితమైన అంశాలను తీసుకుని, వాటికి చక్కటి ప్రేమ కథను జోడించి ఈ కథను అల్లాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేందుకు అన్ని రకాల ఎమోషన్స్‌ను మిక్స్ చేసి కథ, కథనాలు రాసుకోవడం కాస్త రిలీఫ్ ఇచ్చే అంశంగా మారింది. అలాగే అన్నదమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు సూర్యనారాయణ అక్కమ్మ. 

తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాలను కెమెరా మెన్ ఎంతో అందంగా చూపించారు. ఏలెందర్ మహావీర్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యేలా ఉంది. పాటలు బాగున్నాయి. ప్రదీప్ చంద్ర ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఫైట్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి. సూర్య నారాయణ  అక్కమ్మ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు, లవ్, ఫ్రెండ్షిప్ ఇలా మూడు జోనర్స్ మీద తీసిన  "దోస్తాన్" సినిమా అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చే అవకాశాలున్నాయి.

రేటింగ్ 2.75

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News