Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Shruti Haasan Knee Injury శ్రుతి హాసన్ ప్రస్తుతం గాయాలతో బాధపడుతోంది. వర్కౌట్లు ఎక్కువగా చేయడంతో ఇలా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే జనాలు మాత్రం ఇంకోలా అర్థం చేసుకుని శ్రుతి హాసన్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2023, 09:27 PM IST
  • భారీ వర్కౌట్లు చేస్తోన్న శ్రుతి హాసన్
  • మోకాళ్లకు గాయం అవ్వడంతో ట్రోల్స్
  • శ్రుతి హాసన్ మీద నెట్టింట్లో సెటైర్లు
Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Shruti Haasan Knee Injury శ్రుతి హాసన్ ప్రస్తుతం ముంబైలో శంతను హజారికతో ఉందన్న సంగతి తెలిసిందే. ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక చిత్రం సలార్. ఆ మూవీ షూటింగ్‌ కూడా గత వారమే పూర్తయింది. ఇక ఆమె ఖాతాలో ఒక్క తెలుగు సినిమా కూడా లేనట్టుగా కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ సంక్రాంతికి శ్రుతి హాసన్ హిట్లు కొట్టింది. రెండు సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమాల్లో శ్రుతి హాసన్ పోషించిన పాత్రలు, కనిపించిన నిడివి మీద ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి.

శ్రుతి హాసన్ ఇప్పుడు తెలుగు మేకర్లు తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపించడం లేనట్టుగా ఉంది. ఇక సీనియర్ హీరోలకు వేరే ఆప్షన్ లేకపోతే శ్రుతి హాసన్ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాల్లో శ్రుతి హాసన్‌ను తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. ఈ రెండింట్లో వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. వీర సింహా రెడ్డి హిట్టుగా నిలిచింది.

వీర సింహా రెడ్డి సినిమాలో అయితే శ్రుతి హాసన్ పాత్ర మీద దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఇంతలా చిరాకు పుట్టించిన పాత్ర ఈ మధ్య కాలంలో ఎప్పుడూ రాలేదన్నట్టుగా ట్రోల్స్ మీమ్స్ వచ్చాయి. అయితే శ్రుతి హాసన్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. తన పని తాను అన్నట్టుగా సినిమాలను చేసుకుంటూ పోతోంది. ఇక శంతనుతో ఎక్కువ సమయం గడిపేందుకు శ్రుతి హాసన్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది.

 

ఈ ఇద్దరూ కలిసి వర్కౌట్లు చేస్తున్నారు. వీకెండ్ పార్టీలంటూ తిరుగుతున్నారు. మొన్నటికి మొన్న నీరజ కోన, శ్రుతి హాసన్, శంతను కలిసి రెస్టారెంట్‌లో సందడి చేశారు. తాను ఒక ఫుడ్ లవర్‌ని అని, తనకు కూడా ఫుడ్ లవర్ అయిన శంతను దొరకడం ఎంతో లక్కీ అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.

 

తాజాగా శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం అయిందట. వర్కౌట్లు ఎక్కువగా చేయడంతో ఇలా జరిగిందట. కానీ జనాలు మాత్రం నాటీ కామెంట్లు చేస్తున్నారు. ఆ గాయం ఎందుకు అయిందో మాకు తెలుసు అంటూ.. సెటైర్లు వేస్తున్నారు. ఇక శ్రుతి హాసన్ మోకాళ్ల గాయం మీద లెక్కలేనన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా

Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News