Shruti Haasan : నా స్టామినాను సహనంతో భరిస్తాడు!.. శ్రుతి హాసన్ వీడియో వైరల్

Shruti Haasan About Her Workout శ్రుతి హాసన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉంది. శ్రుతి హాసన్ మీద లెక్కలేనన్ని ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆమె మోకాలి గాయం మీద గత వారం నుంచి మీమ్స్ పడుతూనే ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 10:25 PM IST
  • వర్కౌట్లతో బిజీగా శ్రుతి హాసన్
  • పిచ్చితనాన్ని భరిస్తున్న ట్రైనర్
  • శ్రుతి హాసన్ వీడియో వైరల్
Shruti Haasan : నా స్టామినాను సహనంతో భరిస్తాడు!.. శ్రుతి హాసన్ వీడియో వైరల్

Shruti Haasan About Her Stamina శ్రుతి హాసన్ ప్రస్తుతం వర్కౌట్లతో కుస్తీ పడుతోంది. తన ట్రైనర్‌ను ఎలా విసిగిస్తోందో చూపించింది. వర్కౌట్లు మానేసి ఎలా పిచ్చిగా గెంతులు వేస్తోందో చూపించింది. తన పిచ్చిని, తన స్టామినానను భరిస్తాడు అంటూ తన ట్రైనర్ గురించి చెబుతూ శ్రుతి హాసన్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అసలే శ్రుతి హాసన్ గత రెండు వారాలుగా విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. తన మోకాలికి గాయమైనట్టుగా శ్రుతి హాసన్ ప్రకటించిన దగ్గరి నుంచి ఆ ఫోటోల మీద ఎలాంటి మీమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనాలు శ్రుతి హాసన్‌ ఎంతో నాటీ అంటూ నాటుగా సెటైర్లు వేశారు.

ఆ తరువాత ఆ గాయాలు, మోకాలి మీద యాంగిల్ ఎలా ఉందంటూ మరికొందరు మరింత పచ్చిగా ప్రశ్నలు వేశారు. దానికి సైతం శ్రుతి హాసన్ సమాధానాలు ఇచ్చింది. ఇలా శ్రుతి హాసన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ రకంగా హాట్ టాపిక్ అవుతూనే వస్తోంది.

 

తాజాగా శ్రుతి హాసన్ మళ్లీ వర్కౌట్లతో బిజీగా మారిందట. చాలా రోజుల తరువాత మళ్లీ స్టార్ట్ చేశానని, తన పిచ్చిని, తన స్టామినాను భరిస్తాడు అంటూ తన ట్రైనర్ గురించి శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోలో శ్రుతి హాసన్ చేసిన విన్యాసాలు చూస్తే కచ్చితంగా నవ్వు వస్తుంది. పిచ్చి పిచ్చిగా అటూ ఇటూ తిరుగుతూ ఎగురుతూ హంగామా చేసింది.

శ్రుతి హాసన్‌కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చేలా ఉంది. ఇప్పటికే రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలు సంక్రాంతి హిట్లుగా నిలిచాయి. ఇక ఇదే ఏడాది ప్రశాంత్ నీల్, ప్రభాస్ సలార్ సినిమా కూడా బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రుతి హాసన్ ఫేట్ మరింతగా మారిపోయేలా ఉంది.

Also Read:  Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్

Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్‌ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News