Prabhas: ప్రభాస్ అలా చేస్తేనే మళ్లీ నటిస్తా.. శ్రద్ధా కపూర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..

Shraddha Kapoor: ప్రభాస్, శ్రద్ధా కపూర్ కలిసి.. సాహో సినిమాలో కనిపించి సినీ ప్రేక్షకులను మెప్పించారు. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ ప్రభాస్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 3, 2024, 11:31 AM IST
Prabhas: ప్రభాస్ అలా చేస్తేనే మళ్లీ నటిస్తా.. శ్రద్ధా కపూర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..

Shradda Kapoor About Prabhas : ప్రభాస్ మంచితనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి వారైనా సరే ప్రభాస్ ని డార్లింగ్ అనే పిలుస్తారు. అందుకు ముఖ్య కారణం ..ఆయన ప్రవర్తన తీరు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడం.. అనేది ప్రభాస్ని చూసే నేర్చుకోవాలి అని అనిపించక మానదు. తన అభిమానులతో అలానే తన తోటి నటులతో ఎంతో ప్రేమగా కొనసాగుతూ ఉంటారు ఈ రెబల్ స్టార్.

ఈ క్రమంలో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ప్రభాస్ గురించి పెట్టిన.. కొన్ని వ్యాఖ్యలు ఆయన అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి. అసలు విషయానికి వస్తే సుజిత్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా చేసిన సినిమా సాహో. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది.

ఈ క్రమంలో తాజాగా శ్రద్ధ కపూర్ కి ప్రభాస్ కి సంబంధించిన ఒక ప్రశ్న ఇంస్టాగ్రామ్ లో ఎదురుకాగా.. అందుకు తనదైన స్టైల్ లో జవాబు ఇచ్చింది ఈ హీరోయిన్.

తన తోటి నటులకు ప్రభాస్ ఎప్పుడు తన ఇంటి నుంచి.. భోజనం తెప్పిస్తూ ఉంటారని మనం తరచుగా వింటూనే ఉంటాము. అయితే సాహో షూట్ టైంలో కూడా శ్రద్ధ కపూర్ కి ప్రభాస్ పలుమార్లు ఇంటి నుంచి ఫుడ్ తెప్పించి పెట్టాడు. ఇక తాజాగా శ్రద్ధ కపూర్ ఇంస్టాగ్రామ్ లో.. తన ఫోటోలు పోస్ట్ చేయగా కింద కామెంట్స్ లో ఓ నెటిజన్ ప్రభాస్ తో మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని ప్రశ్న పెట్టాడు. అందుకు సమానంగా ఈ హీరోయిన్..’ ప్రభాస్ మళ్ళీ తన ఇంటి నుంచి ఫుడ్ పంపించినప్పుడు’ అని కామెంట్ చేసింది. 

ఇక దీంతో సాహో సినిమా వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్న.. శ్రద్ధ ఇంకా ప్రభాస్ పెట్టిన ఫుడ్ గుర్తుపెట్టుకుంది అంటే ప్రభాస్ ఏ రేంజ్ లో ఫుడ్ తెప్పించాడో.. అని నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈమధ్య సలార్ సినిమాతో మంచి విజయం అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ హీరో నాగ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న కల్కి 2898 AD సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులకే కాకుండా తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

Also read: AP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News