Salman Khan Number : ఫోన్ చేస్తున్నాడని సల్మాన్ నంబర్‌నే బ్లాక్ చేసిందట!.. బిగ్ బాస్ బ్యూటీ షెహ్నాజ్ గిల్ మామూల్ది కాదు

Shehnaaz Gill Movies బిగ్ బాస్ షోతో క్రేజ్ తెచ్చుకున్న షెహ్నాజ్ గిల్‌ తన పర్సనల్ లైఫ్‌లో విషాదాన్ని చవి చూసింది. బిగ్ బాస్ ఇంట్లో సిద్దార్థ్ శుక్లా, షెహ్నాజ్ గిల్‌ల రిలేషన్‌కు అంతా ఫిదా అయ్యారు. అభిమానులు సిద్నాజ్ అంటూ ట్రెండ్‌ను క్రియేట్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 10:34 AM IST
  • నెట్టింట్లో సల్మాన్ ఖాన్ వీడియో
  • కపిల్ శర్మ షోలో షెహ్నాజ్ గిల్
  • నంబర్ బ్లాక్ చేశానన్న బిగ్ బాస్ బ్యూటీ
Salman Khan Number : ఫోన్ చేస్తున్నాడని సల్మాన్ నంబర్‌నే బ్లాక్ చేసిందట!.. బిగ్ బాస్ బ్యూటీ షెహ్నాజ్ గిల్ మామూల్ది కాదు

Shehnaaz Gill Salman Khan బిగ్ బాస్ షోలో జరిగేది ఒకటి.. బయటకు వచ్చాక జరిగేది ఇంకోటి. మన తెలుగు బిగ్ బాస్ ఇంట్లో అయితే లవ్ స్టోరీలు ఎన్నో జరిగాయి. కానీ బయటకు వచ్చాక ఏ ఒక్కటీ సక్సెస్ అవ్వలేదు. టీఆర్పీల కోసం రిలేషన్స్ పెట్టుకునే వారు కొంత మంది ఉంటారు.. నిజంగానే రిలేషన్లోకి వెళ్లే వారు కొంత మంది ఉంటారు. అయితే హిందీ బిగ్ బాస్ పదమూడో సీజన్‌లో సిద్దార్థ్ శుక్లా, షెహ్నాజ్ గిల్‌ల జంట కూడా జనాలను అలానే ఆకట్టుకుంది.

సిద్దార్, షెహ్నాజ్‌లు ఎప్పుడూ కూడా తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించలేదు. తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా చెప్పలేదు. అయితే వారిద్దరూ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న క్లోజ్ నెస్‌తో బయట సిద్నాజ్‌ ట్రెండ్ అయింది. బయటకు వచ్చాక కూడా అంతే క్లోజ్‌గా ఉన్నారు. అయితే సిద్దార్థ్ అకస్మాత్తుగా మరణించడంతో పరిస్థితులు మారాయి. షెహ్నాజ్ ఒంటరైనట్టుగా ఫీల్ అయింది. ఇక సిద్నాజ్ ఫ్యాన్స్, సిద్దార్థ్ ఫ్యాన్స్ ఆమెకు అండగానే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు సిద్దార్థ్ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తూ వచ్చారు.

సిద్నాజ్ ట్రోల్స్ మీద సల్మాన్ ఖాన్ స్పందించాడు. సిద్దార్థ్ ఇప్పుడు లేడు.. సిద్దార్థ్ ఉన్నా కూడా షెహ్నాజ్ ముందుకు వెళ్లాలి.. ఆనందంగా ఉండాలి.. పెళ్లి చేసుకోవాలని కోరుకునే వాడు.. మీరు ఆమెను ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అంటూ సిద్నాజ్ ఫ్యాన్స్‌ను సల్మాన్ ఖాన్ వారించాడు. ఇక సల్మాన్ ఖాన్ అయితే షెహ్నాజ్‌కు ఎప్పుడూ అండగానే ఉంటున్నాడు.

Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్

కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమా ఆఫర్‌ను సల్మాన్ ఖాన్ పిలిచి మరీ ఇచ్చాడట. షెహ్నాజ్‌కు ఓ నంబర్‌ను కాల్ వచ్చిందట. ఎవరిదో తెలియకపోవడంతో వెంటనే బ్లాక్ చేసిందట. కానీ ఆ కాల్ చేసింది సల్మాన్ ఖాన్ అంట. మళ్లీ వేరే నంబర్‌ నుంచి సల్మాన్ ఖాన్ ఫోన్ చేశాడట. సినిమా చేస్తావా? లేదా? అని అడిగాడట. స్క్రిప్ట్ ఏంటి సర్ అని అడిగిందట. కానీ సల్మాన్ అదేమీ చెప్పలేదట. సినిమా చేస్తావా? లేదా?అని మళ్లీ అడిగాడట. అలా షెహ్నాజ్‌కు సల్మాన్ ఆఫర్ ఇచ్చాడట.

Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News