Shamita Shetty about Raj Kundra: రాజ్ కుంద్రా అరెస్ట్‌పై పెదవి విప్పిన షమిత శెట్టి

Shamita Shetty about Raj Kundra's arrest in Pornography case: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్‌పై బిగ్ బాస్ 15 హిందీ రియాలిటీ షో కంటెస్టంట్, బాలీవుడ్ నటి షమితా శెట్టి ఎట్టకేలకు పెదవి విప్పింది. తన సోదరి శిల్పా శెట్టి భర్త (Shilpa Shetty) రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పుడు ఏ కారణం లేకుండానే, తన తప్పు లేకుండానే నెటిజెన్స్ తనను భారీగా ట్రోల్ చేశారని షమితా శెట్టి వాపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2021, 12:43 PM IST
Shamita Shetty about Raj Kundra: రాజ్ కుంద్రా అరెస్ట్‌పై పెదవి విప్పిన షమిత శెట్టి

Shamita Shetty about Raj Kundra's arrest in Pornography case: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్‌పై బిగ్ బాస్ 15 హిందీ రియాలిటీ షో కంటెస్టంట్, బాలీవుడ్ నటి షమితా శెట్టి ఎట్టకేలకు పెదవి విప్పింది. తన సోదరి శిల్పా శెట్టి భర్త (Shilpa Shetty) రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పుడు ఏ కారణం లేకుండానే, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకుండానే, ఇంకా చెప్పాలంటే ఇందులో తన తప్పు ఏమీ లేకుండానే నెటిజెన్స్ తనను భారీగా ట్రోల్ చేశారని షమితా శెట్టి వాపోయింది. బిగ్ బాస్ ఓటిటి రియాలిటీ షో (Bigg Boss OTT) నుంచి ఎలిమినేట్ అయినప్పుడు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన షమితా శెట్టి.. ఇదే విషయం చెప్పుకుని ఆవేదన వ్యక్తంచేయగా ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు సైన్ చేసిన సమయంలోనే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ చూసి చాలా బాధపడ్డాను. ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాను. కానీ కరోనావైరస్ (Coronavirus) కారణంగా చాలా మంది పని కోల్పోయి ఇంటికే పరిమితం అయిన సమయంలో నాకు బిగ్ బాస్ హౌజ్‌లో కూర్చుని డబ్బు సంపాదించుకునే అవకాశం లభించింది. అన్నింటికి మించి వారికి మాట ఇచ్చి ఆ డీల్‌కి సైన్ చేశాను. ఏదేమైనా షో ఆగకూడదని షో నిర్వాహకులు చెప్పారు. అందుకే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనాలని డిసైడ్ అయ్యాను అంటూ ఎలాంటి పరిస్థితుల్లో తాను బిగ్ బాస్‌కి వచ్చాననే విషయాలను షమితా శెట్టి (Shamita Shetty) వివరించింది.

Also read : MAA Elections 2021: వేడెక్కిన 'మా' ఎలక్షన్స్...మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు

రాజ్ కుంద్రా అరెస్ట్ (Raj Kundra arrested in Pornography case) తర్వాత ఆ కేసుతో ఏ సంబంధం లేని తనను, తన కుటుంబాన్ని కూడా విపరీతంగా ట్రోల్ చేయడం చాలా బాధనిపించింది అని చెప్పుకుని ఆవేదన వ్యక్తంచేసిన షమితా శెట్టి.. వర్క్ పరంగా తన కమిట్‌మెంట్స్ తనకు ఉన్నాయని, తన పనులు తాను చేసుకుంటూ ఆ ట్రోల్స్‌కి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు పేర్కొంది.

Also read : Aryan Khan arrest, bail live updates: షారుక్‌ తనయుడికి బెయిల్‌ నిరాకరణ.. మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x