Pathaan Collections: మూడ్రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేసిన పఠాన్ సినిమా

Pathaan Collections: షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం నటించిన పఠాన్ అభిమానుల్ని కచ్చితంగా ఆకట్టుకుంది. పఠాన్ కలెక్షన్లు ట్రెండింగ్ అవుతుంటే మరోవైపు వచ్చేవారం అత్యంత కీలకం కానుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 28, 2023, 05:22 PM IST
Pathaan Collections: మూడ్రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేసిన పఠాన్ సినిమా

షారుఖ్ ఖాన్..నాలుగేళ్ల విరామం తరువాత భారీ హిట్‌తో దూసుకొచ్చాడు. పఠాన్ సినిమా భారీ విజయం అందరి నోళ్లు మూయించింది. బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుగొడుతూ దూసుకుపోతోంది. పఠాన్ సినిమా కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మూడ్రోజుల్లోనే 3 వందల కోట్లు దాటిందని తెలుస్తోంది. 

షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ అంతర్జాతీయంగా 3 వందల కోట్ల కలెక్షన్లు సాధించింది. దక్షిణాది సినిమా విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ రమేష్ బాలా పఠాన్ సినిమా తాజా కలెక్షన్ల గురించి ట్విట్టర్‌లో అప్‌డేట్ చేశాడు. మూడ్రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు దాటిందని ట్వీట్ చేశాడు. దేశీయంగా రెండవరోజున 70 కోట్లు సంపాదించింది. బ్రహ్మాస్త్ర సినిమా రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్త కలెక్షన్లను పఠాన్ సినిమా దాటేసింది. బ్రహ్మాస్త్ర రెండ్రోజుల్లో 225 కోట్లు వసూలు చేయగా, పఠాన్ సినిమా తొలి రెండ్రోజుల్లో 230 కోట్లు దాటేసింది. 

మరోవైపు దేశీయంగా అంటే ఇండియాలో తొలిరోజు 55 కోట్లు నెట్ వసూళ్లతో హిందీ సినిమా చరిత్రలో కొత్త రికార్డు సాధించింది. హిందీ సినిమాలో తొలిరోజు ఇంత పెద్దమొత్తంలో నెట్ వసూళ్లు సాధించడం ఇదే. హిందీలో 55 కోట్లు, డబ్బింగ్ వెర్షన్‌లో 2 కోట్లు తొలిరోజు నెట్ వసూళ్లుగా ఉన్నాయి. దేశంలో సూపర్‌స్టార్ నటీనటులైన షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహాం, దీపికా పదుకోన్‌లతో స్పై థీమ్‌తో ఆధిత్య ఛోప్రా తీసిన పఠాన్ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా వేడుక జరుపుకుంటోంది. ఈ సినిమాను సిద్ధార్ధ ఆనంద్ తెరకెక్కించాడు. 

మూడ్రోజుల్లోనే 3 వందల కోట్లు వసూలు చేసిన పఠాన్ సినిమా ఈ వారం ఇదే ట్రెండ్ కొనసాగించవచ్చు. వచ్చేవారం పఠాన్ సినిమాకు కీలకం కానుంది. వచ్చేవారం కూడా వసూళ్లలో ఇదే ట్రెండ్ కొనసాగితే కొత్త రికార్డులు బద్దలు కావచ్చు.

Also read: Nandamuri Taraka Ratna Health: అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి.. బులెటిన్లో ఏముందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News