Shaakuntalam Release Date: సమంత శాకుంతలం రిలీజ్ కి సర్వం సిద్ధమే.. కానీ?

Shaakuntalam Release Date: సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదలకు రంగం సిద్దమైంది, అయితే ఆ సినిమా అప్పుడైనా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.   

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 23, 2023, 10:31 PM IST
Shaakuntalam Release Date: సమంత శాకుంతలం రిలీజ్ కి సర్వం సిద్ధమే.. కానీ?

Shaakuntalam Movie Release Date: విడాకుల తర్వాత సమంత చేసిన భారీ ప్రాజెక్టులు ఒక్కటీ బయటకు రాలేదు. దాదాపుగా చిన్న చిన్న సినిమాలలో ఆమె భాగమైంది తప్ప ఆమె ప్రధాన పాత్రలో రూపొందించిన సినిమాలు ఇప్పటివరకు విడుదల అవలేదు. ఇక ఆమె ప్రధాన పాత్రలో రూపొందించిన శాకుంతలము సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ సినిమా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడో నవంబర్ నెలలో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాని ఎట్టకేలకు వాయిదాలు వేస్తూ వేస్తూ ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేస్తామని చెబుతున్నారు.

అప్పటికైనా విడుదలవుతుందా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం 2023వ సంవత్సరంలో  ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. శకుంతల దుష్యంతుల కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించారు. గుణశేఖర్ సొంత ప్రొడక్షన్లో నిర్మించిన ఈ సినిమా హక్కులను దిల్ రాజుకు అమ్మేయడంతో ఈ సినిమా నిర్మాణ అనంతర బాధ్యతలు దిల్ రాజు చూసుకుంటున్నారు.

ఇక ఈ సినిమాకి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేసుకుంటున్నా సరే ఒకవేళ తేడా పడితే పరిస్థితి ఏమిటి అనే విషయం మీద అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.. శకుంతలగా సమంత నటిస్తున్న ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఇక భరతుడి చిన్ననాటి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటిస్తోంది. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి.

మరి ఇన్ని సార్లు వాయిదా పడిన సినిమాలు గతంలో ఫెయిల్ అయిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. మరి సమంత సినిమాకి ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ఎన్నిసార్లు వాయిదా పడినా కంటెంట్ బాగుంది కాబట్టి హిట్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ 2023వ సంవత్సరంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదలకు రంగం సిద్ధం అవుతోంది.

Also Read: Ram Charan Removed Ayyappa Mala: అమెరికాలో రామ్ చరణ్ అయ్యప్ప మాల తీశేశాడా? అసలు ఏమైందంటే?

Also Read: Telugu OTT Releases This Week: వారసుడు, వీరసింహారెడ్డి సహా ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News