Actor Rajababu Died: టాలీవుడ్​లో మరో విషాదం.. సినీ నటుడు రాజబాబు కన్నుమూత

Serial Actor Raja Babu Died: టాలీవుడ్​ నటుడు రాజబాబు (64) కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రాజబాబు మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 09:07 AM IST
    • సినీ నటుడు రాజబాబు కన్నుమూత
    • అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి
    • అనేక సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటించిన రాజబాబు
Actor Rajababu Died: టాలీవుడ్​లో మరో విషాదం.. సినీ నటుడు రాజబాబు కన్నుమూత

Actor Rajababu Died: ప్రముఖ టాలీవుడ్​ నటుడు రాజబాబు (64) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నటుడు రాజబాబు (Raja Babu News) ఆకస్మిక మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. రాజబాబుకు భార్య, ఇద్దరు కమారులు, కుమార్తె ఉన్నారు.

వ్యక్తిగతం

రాజబాబు స్వస్థలం ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నరసాపురపేట. 1957 జూన్‌ 13న జన్మించిన రాజబాబు.. బాల్యం నుంచి నటనపై ఎంతో ఆసక్తిగా కనబరిచేవారు. రంగస్థల నటుడిగా కెరీర్​ ప్రారంభించిన ఆయన.. అనేక సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. ఈ క్రమంలో 1995లో విడుదలైన 'ఊరికి మొనగాడు' చిత్రంతో రాజబాబు నటుడిగా (Serial Actor Rajababu) సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

నటించిన చిత్రాలు, సీరియళ్లు

'సింధూరం', 'సముద్రం', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'మురారి', 'శ్రీకారం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'కళ్యాణ వైభోగం', 'మళ్ళీ రావా?', 'బ్రహ్మోత్సవం', 'భరత్ అనే నేను' తదితర చిత్రాల్లో నటించారు. దాదాపు 62 చిత్రాల‌లో న‌టించిన ఆయ‌న విభిన్న‌మైన పాత్రలు పోషించారు.

దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'స్వర్గం -నరకం', 'రాధమ్మ పెళ్లి' అనే సినిమాలను సైతం రాజబాబు (Raja Babu News) నిర్మించారు. సినిమాతో పాటు 'వసంత కోకిల', 'అభిషేకం', 'రాధా మధు', 'మనసు మమత', 'బంగారు కోడలు', 'బంగారు పంజరం', 'నా కోడలు బంగారం' వంటి టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 48 సీరియల్స్‌లో నటించారు. 2005లో 'అమ్మ' సీరియల్‌లోని పాత్రకుగానూ రాజబాబుకు నంది అవార్డు వరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News