Vinod Kumar: 'మౌన పోరాటం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు వినోద్ కుమార్ (Vinod Kumar). 'కర్తవ్యం', 'పంజరం', 'మామగారు', 'సీతారత్నంగారి అబ్బాయి' భారత్ బంద్ వంటి ఎన్నో సూపర్‌డూపర్ హిట్ చిత్రాలలో నటించి కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1991లో మామగారు (Mamagaru) సినిమాకు గాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది.
తాజాగా ఓ టీవీ షోకు హాజరైన సీనియర్ నటుడు వినోద్ కుమార్ తన వ్యక్తిగత, సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తర్వాత అంత భారీ ఆస్తులు మీకే ఉన్నాయటగా అన్న ప్రశ్నకు వినోద్ షాక్ అయ్యాడు. ముకేశ్ అంబానీకి ఉన్నదాంట్లో 0.1% ఆస్తులున్నా ఇక్కడెందుకు ఉంటా? ఎప్పుడో లండన్‌లో స్థిరపడేవాడిని..అంటూ వినోద్ చెప్పుకొచ్చాడు.
యుక్త వయసులో ఉన్నప్పుడు ఎంతో మందిని ప్రేమించాను కానీ వారెవరూ తనను తిరిగి ప్రేమించకపోవడంతో చివరకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నానని ఆయన తెలిపాడు. 'కర్తవ్యం' మూవీలో హీరో సాయి కుమార్ (hero Sai kumar) తనకు డబ్బింగ్ చెప్పకపోయేసరికి కొడదామనుకున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆమనితో రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ షూటింగ్ చేస్తున్నామని... అది చూడలేక తన భార్య సెట్స్‌లో నుంచి వెళ్లిపోయిందని ఆనాటి జ్ఞాపకాలను తలచుకున్నాడు వినోద్ కుమార్.
Also Read: Samantha: లవ్ యూ నల్గొండ.. నా గుండెల్లో ప్రత్యేకం స్థానం ఉంది: సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook