RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ... ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్‌ మధ్యన చిచ్చు...

RRR Movie First Review: స్వయంప్రకటిత సినీ అనలిస్ట్, స్వయం ప్రకటిత యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు 'ఆర్ఆర్ఆర్' మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. తన రివ్యూతో ఎన్టీఆర్, చెర్రీ ఫ్యాన్స్ మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 05:48 PM IST
  • ఆర్ఆర్ఆర్‌పై ఉమైర్ సంధు రివ్యూ
  • సినిమాకు ఆత్మ ఎన్టీఆరే అని కామెంట్
  • ఉమైర్ సంధు రివ్యూపై చెర్రీ ఫ్యాన్స్ ఫైర్
RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ... ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్‌ మధ్యన చిచ్చు...

RRR Movie First Review: స్వయంప్రకటిత సినీ అనలిస్ట్, స్వయం ప్రకటిత యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు 'ఆర్ఆర్ఆర్' మూవీకి (RRR Movie) ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ఆర్ఆర్ఆర్ సెన్సార్ స్క్రీనింగ్ చూశానని ట్విట్టర్‌లో పేర్కొన్న అతను... ఈ సినిమా పూర్తిగా జూ.ఎన్టీఆర్‌దే అని... సినిమాకు అతనే ఆత్మ అని తేల్చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్... 'జై ఎన్టీఆర్..' అంటూ కామెంట్స్ చేస్తుండగా... రాంచరణ్ ఫ్యాన్స్ ఉమైర్ సంధుపై దుమ్మెత్తిపోస్తున్నారు. అనవసరంగా ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ మధ్యలో చిచ్చు పెట్టొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

ఇదే ఉమైర్ సంధు (Umair Sandhu) గతంలో చాలా సినిమాలకు అడ్డదిడ్డమైన రివ్యూలు ఇచ్చాడు. చాలా సందర్భాల్లో అతని రివ్యూలు బోల్తా కొట్టాయనే చెప్పాలి. పెద్ద సినిమా రిలీజ్‌లకు ముందు.. ఇలా రివ్యూలతో మీడియాలో హైలైట్ అయ్యేందుకు తెగ ఆరాటపడుతుంటాడు. అందుకే ఉమైర్ సంధు రివ్యూని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని... అతని రివ్యూకి ఎక్కువ అటెన్షన్ ఇవ్వొద్దని చెర్రీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

గతంలో ఫ్లాప్ సినిమాలకు బ్లాక్ బస్టర్ అని.. బ్లాక్ బస్టర్ సినిమాలకు ఫ్లాప్ అని రివ్యూలు ఇచ్చాడు ఉమైర్ సంధు. అజ్ఞాతవాసి, స్పైడర్, సాహో వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అంటూ రిలీజ్‌కి ముందే రివ్యూలు ఇచ్చేశాడు. తీరా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ ఉమైర్ సంధుని ఓ ఆట ఆడుకున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది ఎంతలా తిట్టిపోసినా ఉమైర్ సంధు మాత్రం తన రివ్యూల పరంపర ఆపట్లేదు. సరికదా.. తన రివ్యూలతో మీడియాలో ఎప్పటికప్పుడు ఫోకస్ అవుతూనే ఉన్నాడు.

 

సాధారణంగా ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారంటే... ఇద్దరిలో ఎవరి పెర్ఫామెన్స్ బాగుంది... ఆన్‌స్క్రీన్ ఎవరిని ఎక్కువసేపు చూపించారనే చర్చలు కామన్. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) విషయంలో ఇలాంటి చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా... ఎన్టీఆర్, చరణ్ పాత్రలను దర్శకుడు రాజమౌళి ఈక్వల్‌గా ట్రీట్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది.

Also Read: Ante Sundaraniki: 'శ్యామ్​ 2021ని ముగించాడు.. కొత్త ఏడాది సుందర్ పరిచయం'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News