Sekhar Kammula Leader 2: 'లీడర్' మూవీ సీక్వెల్‌లో రానాకు బదులు ఆ స్టార్ హీరో...?

Sekhar Kammula Leader 2: దగ్గుబాటి రానా హీరోగా 12 ఏళ్ల క్రితం వచ్చిన 'లీడర్ 2' సినిమాకు త్వరలో సీక్వెల్ రానుందా... ఈ సినిమాలో రానాకు బదులు మరో స్టార్ హీరో కనిపించనున్నాడా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 02:28 PM IST
  • శేఖర్ కమ్ముల లీడర్ 2 సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
  • ఈ సినిమాలో రానాకు బదులు మరో స్టార్ హీరో కనిపించే ఛాన్స్
  • ఎవరా స్టార్ హీరో... ఏమా కథ... పూర్తి వివరాలు తెలుసుకోండి
Sekhar Kammula Leader 2: 'లీడర్' మూవీ సీక్వెల్‌లో రానాకు బదులు ఆ స్టార్ హీరో...?

Sekhar Kammula Leader 2: సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ శేఖర్ కమ్ముల. రెగ్యులర్ మాస్, మసాలా స్టోరీలకు ఆయన సినిమాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. సున్నితమైన కథ, కథనాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆయన మెస్మరైజ్ చేయగలరు. లీడర్ లాంటి పొలిటికల్ డ్రామాను తెరకెక్కించినా... ఎక్కడా హింస, రక్తపాతం, భారీ డైలాగ్స్ వంటి జోలికి వెళ్లలేదు. శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి క్లాసిక్‌గా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లీడర్ 2 సీక్వెల్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో లీడర్ 2ని తెరకెక్కించే యోచనలో శేఖర్ కమ్ముల ఉన్నారట. దీనిపై ఇప్పటికైతే శేఖర్ కమ్ముల నుంచి కానీ సూర్య నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్‌తో చేయబోయే ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే లీడర్ 2ని పట్టాలెక్కించే అవకాశం లేకపోలేదు.

2010లో 'రానా'ని హీరోగా పరిచయం చేస్తూ 'లీడర్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా కమర్షియల్‌గా అంతగా వర్కౌట్ కానప్పటికీ... మంచి క్లాసికల్‌గా నిలిచిపోయింది. పొలిటికల్ డ్రామాను ఇలా కూడా తెరకెక్కించవచ్చా అని అంతా అనుకునేలా చేశారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా వచ్చి దాదాపు 12 ఏళ్లు అవుతోంది. దీనికి సీక్వెల్ ఉంటుందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. దీనిపై గతంలో రానా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. లీడర్ 2కి సంబంధించి శేఖర్ రెండు, మూడు సీన్లు చెబుతుంటారు.. ఆ తర్వాత మళ్లీ దాని ఊసెత్తరని చెప్పారు. నిజానికి లీడర్ 2 తెరకెక్కించాలనే ఆలోచన శేఖర్‌కి చాలా కాలంగా ఉన్నప్పటికీ.. సరైన కథ దొరక్కపోవడం వల్లే సీక్వెల్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. 

Also Read: TRS Plenary 2022: జాతీయ రాజకీయాలే ప్రాతిపదికగా..అత్యంత ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ దృశ్యాలు

Also Read: SBI Phishing Scam: మీరు ఎస్‌బీఐ కస్టమర్లా.. అయితే ఈ అలర్ట్ మీకోసమే... ఆ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేస్తే అంతే సంగతి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News