Maa Oori Polimera 2 Trailer: ఆసక్తి రేకెత్తిస్తోన్న 'మా ఊరి పొలిమేర-2' ట్రైలర్

Maa Oori Polimera 2 Movie: సత్యం రాజేష్‌ టైటిల్ రోల్ చేస్తున్న మూవీ థ్రిల్లర్‌ 'మా ఊరి పొలిమేర-2'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది ఎలా ఉందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2023, 01:59 PM IST
Maa Oori Polimera 2 Trailer: ఆసక్తి రేకెత్తిస్తోన్న 'మా ఊరి పొలిమేర-2' ట్రైలర్

Maa Oori Polimera 2 Trailer: సత్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్‌ శ్రీను లీడ్ రోల్సో లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మా ఊరి పొలిమేర-2' (Maa Oori Polimera 2 ). అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గౌరికృష్ణ నిర్మించారు. ఈ మూవీ నవంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. జ్ఞాని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరింది. గుడి మిస్టరీ, చేతబడుల కాన్సెప్ట్ ఆధారంగా ఈ సీక్వెల్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ''మహబూబ్‌నగర్ లో దారుణం.. అసలు చేతబడులు నిజంగా ఉన్నాయా'' అనే టీవీ న్యూస్ ఛానెల్ వార్తలతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. తొలి భాగం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదిగా స్ట్రీమింగ్ కాగా.. ఈ సీక్వెల్ ను మాత్రం థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. 

తొలి భాగంలో మంచి సస్పెన్స్ తో ముగించిన మేకర్స్.. సీక్వెల్లో మాత్రం సైన్స్, మూఢనమ్మకం మధ్య జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మహబూబ్‌నగర్ లో జరిగిన దారుణ హత్యలకు, చేతబడులకు మధ్య ఉన్న లింకేంటి అనేది తెలుసుకోవడానికి ఓ పోలీస్ అధికారి, ఓ ఆర్కియాలజిస్ట్ బయలుదేరుతారు. ఆ గ్రామంలోని ఆలయ మిస్టరీని వీళ్లు ఛేదించారా లేదా అనేది మూవీ స్టోరీ. ఈ సీక్వెల్ కు భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పార్ట్ 1 ఎంత విజయవంతమైందో రెండో భాగం కూడా అలానే సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News