అలనాటి నటుడు శశికపూర్ ఇటీవలే మరణించిన క్రమంలో ఆయనకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే "అమూల్" కాస్త వినూత్నమైన రీతిలో ఆ సహజ నటుడికి నివాళులు అందివ్వాలని సంకల్పించింది. అందుకే దీవార్ సినిమాలో శశికపూర్ చెప్పిన ప్రముఖ డైలాగ్ "మేరే పాస్ మా హై"ను "మేరే పాస్ ఆప్కా సినిమా హై"గా మార్చి ఆ డైలాగ్ శశికపూర్ చెబుతున్నట్లుగా ఒక క్యారికేచర్ వేయించింది అమూల్ సంస్థ.
ప్రస్తుతం ఆ క్యారికేచర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీవార్ సినిమాలో అమితాబ్ తమ్ముడిగా నటించిన శశికపూర్‌కు ఆ పాత్ర తెచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఒక సిన్సియర్ పోలీస్ అధికారిగా హంతకుడైన తన అన్నను ఎదిరించే క్రమంలో శశికపూర్ పలికిన ఆ డైలాగ్ చాలా మంది మన్ననలను అందుకుంది. ముంబయి పోలీస్ వారు కూడా శశికపూర్‌కి ట్విటర్ ద్వారా వినూత్నంగా నివాళులు అర్పించారు. నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన చూపించిన నటనను ప్రశంసించారు.
#Amul Topical: Tribute to an actor and a gentleman. pic.twitter.com/hDatbUaNwA
— Amul.coop (@Amul_Coop) December 5, 2017
The ‘Deewar’ between the ‘Good’ and ‘Bad’ that shall always stand tall till many generations to come #RIPShashiKapoor pic.twitter.com/Z3x37OSC9G
— Mumbai Police (@MumbaiPolice) December 5, 2017