Sarkaru Vaari Paata Trailer: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'సర్కారు వారి పాట' ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది!

Sarkaru Vaari Paata Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 12:01 PM IST
Sarkaru Vaari Paata Trailer: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'సర్కారు వారి పాట' ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది!

Sarkaru Vaari Paata Trailer: మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకొంటోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో జోరును పెంచాలని చిత్రబృందం సిద్ధమైంది. అందులో భాగంగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను గురువారం ఉదయం విడుదల చేశారు. 

అందులో 'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఈ రోజు అనగా (గురువారం) సాయంత్రం 4.05 గంటలకు తెలియజేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన 'కళావతి', 'పెన్నీ' లిరికల్ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కేవలం 'కళావతి' లిరికల్ సాంగ్ కు యూట్యూబ్ లో 150 మిలియన్స్ కు పైగా వ్యూస్ లభించాయి. అయితే ఈ మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని గంటలు వేచిచూడాల్సిందే. 

పరశురామ్ దర్శకత్వంలో రుపొందిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ తో జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  
 

Also Read: Swag లుక్ లో ఉన్న ఈ సొట్టబుగ్గల సుందరి ఎవరో గుర్తుపట్టారా?

Also Read: Chiru Leaks: చిరు లీక్స్.. పవన్ కల్యాణ్ సినిమాలోని డైలాగ్ బయటపెట్టిన మెగాస్టార్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News