SARKAARU VAARI PAATA : సీఎం జగన్‌ డైలాగ్‌తో క్రేజ్ పెంచిన మహేష్‌

SARKAARU VAARI PAATA Trailer : మహేష్‌బాబు, కీర్తి సురేష్‌ హిరోహిరోయిన్లుగా పరుశురమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. తాజాగా ట్రైలర్ మాంచి హైప్ క్రియేట్ చేస్తోంది. మహేశ్ బాబుకు హ్యాట్రిక్ హిట్ పక్కా అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 09:50 PM IST
  • మహేశ్‌బాబు సర్కారు వారి పాట ట్రైలర్ విడుదల
  • సీఎం జగన్‌ డైలాగ్‌తో పాటు మరిన్ని సూపర్ డైలాగ్స్
  • ఆకట్టుకునే ట్రైలర్ కట్ చేయించిన దర్శకుడు పరుశురామ్
SARKAARU VAARI PAATA : సీఎం జగన్‌ డైలాగ్‌తో క్రేజ్ పెంచిన మహేష్‌

Sarkaru Vaari Paata Trailer : సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట చిత్రం ట్రైలర్ ఇవాళ 4 గంటల 5 నిమిషాలకు విడుదలైంది. పరుశురామ్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జీమహేష్‌బాబు ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కింది ఈ మూవీ. కీర్తి సురేశ్ హిరోయిన్‌గా నటిస్తోంది. వరుస హిట్లతో జోరు మీదున్న మహేష్‌బాబు ఈ మూవీతోనూ మరో బ్లాక్ బస్టర్ అందుకుని హ్యాట్రిక్ హిట్ సాధిస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా మే 12న విడుదల కానున్న సర్కారు వారి పాట చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఒక రేంజ్‌లో హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు.

ఈ ట్రైలర్ రిలీజైన కాసేపటిక మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా సూపరి డూపర్ డైలాగ్స్‌తో అద్దరగొడుతున్నాడు. యు కన్ స్టీల్ మై లవ్.. నా ప్రేమను దొంగిలించగలవు. యు కన్ స్టీల్ మై ఫ్రెండ్‌షిప్... నా స్నేహం దొంగిలించగలవు. బట్ యు కాంట్ స్టీల్ మై మనీ.. అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ఓపెనింగ్ బిట్ కట్ చేశారు.

అమ్మాయిల్నీ, అప్పిచ్చే వాళ్లనీ పాంపర్ జేయాల్రా... రఫ్‌గా హాండిల్ చేయగూడదు.. అంటూ ఫైటింగ్‌లో ప్రత్యర్థికి హెల్మెట్ పెట్టి మరీ డైలాగ్ చెప్పి... ఆ నేక్స్ట్... అంటూ ఆ తర్వాత మరో పవర్‌ఫుల్ డైలాగ్‌ చెప్పేస్తాడు.

ఇక ఆ నేక్స్ట్ దగ్గర డైలాగ్ కట్‌ అయి... హిరోయిన్‌ ఎంట్రీ ఇస్తుంది. మహేశ్‌బాబును అప్పు అడిగే సీన్ అది. మీరొక 10 థౌసండ్ అప్పిస్తే... ఎగ్జామ్ ఫీస్ కట్టి... మాస్టర్స్‌లో టాప్ స్కోర్ చేస్తాను అంటుంది కీర్తి. ఆ తర్వాత సీన్... మహేష్‌ బాబు మార్వలస్‌ డైలాగ్. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వాడిన ఊత పదం... నేను విన్నాను.. నేనున్నాను. ఈ డైలాగ్‌ను మహేష్‌బాబు చెప్తే... చెప్తే కాదు.. చెప్పేశాడు.  వెంటనే కీర్తి సురేష్‌ హగ్. అయినా ఇలాంటి డైలాగ్ చెప్పాక హగ్ రాకుంటే ఏం వస్తుంది. ఆ వెంటనే కమాన్ కమాన్ కళావతి సాంగ్‌ బిట్. ఆ వెంటనే వెన్నెల కిశోర్‌తో కామెడీ ట్రాక్‌ బిట్.

ఆ తర్వాత అసలు ఎవడ్రా నువ్వు... అని ఫోన్‌లో విలన్ డైలాగ్. దిసీజ్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలపుడ బీచ్ సర్.. అంటూ మహేష్‌ బాబు పవర్‌ఫుల్ రిప్లై. ఆ తర్వాత రాజేంద్రనాథ్‌తో రోడ్డు మీద ఆటలాడావ్ నువ్వు అంటూ సముద్ర ఖని లుంగీ ఎత్తుతూ దూసుకెళ్తున్న సీన్లో విలన్ పవర్‌ఫుల్‌ ఎంట్రీ. ఆ వెంటనే బోట్‌ను అడ్డంగా ఆపేసిన సూపర్ స్టార్. కట్ చేస్తే...  ఏటి చేసేస్తవ్ నువ్వు... ఆయ్ చేసేస్తాడటా... అంటూ సుబ్బరాజుతో చెప్పే డైలాగ్.

ఆ వెంటనే మరో డైలాగ్. అప్పనేది ఆడ పిల్ల లాంటిది సార్. ఇక్కడెవడూ ఆడపిల్ల తండ్రిలా బిహేవ్ చేయట్లేదు. అంటూ మహేష్ డైలాగ్ చెప్తుంటే... నదియా కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తుంది.

 అ డైలాగ్‌ అయిపోగానే సముద్రఖని డైలాగ్.. నా దృష్టిలో అప్పంటే సెటప్పు లాంటిది. అని. అలా కట్ చేస్తే... బ్యాంకులో మహేష్‌బాబు రచ్చ చేసే సీన్. ఆ తర్వాత సీన్ రోడ్డెక్కుతుంది. మహేష్‌ పోసాని, తనికెళ్ల భరణి లాంటి వాళ్ల ముందు జనంలో... ఎందుకంటే ఆడిది మరి.. పెద్ద... అనుకుంటూ చెప్పే డైలాగ్ క్రేజీగా అనిపిస్తుంది.
ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కార్యాలయంలో కేంద్ర మంత్రిని ఒక గ్లింప్స్ చూపించి... ఆ వెంటనే అజయ్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని అంతా షాక్‌లో ఉన్నట్లుగా చూపించే సీన్.  ఆ వెంటనే బాయ్‌కాట్ బ్యాంక్స్ అంటూ బీచ్‌లో సైకత శిల్పం. కట్ చేసి డైరెక్టర్‌ టైటిల్ వేసేశారు.

 ఆ వెంటనే సీరియస్ నోట్‌లో మరో డైలాగ్... ఓ వంద వయాగ్రాలేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికొచ్చినట్టొచ్చారు... అంటూ చేతిలో తాళాల గుత్తి పట్టుకుని.. చైర్‌లో కూర్చుని చిన్న సైడ్ విలన్‌ని రౌండ్లు వేస్తూ రేవెట్టేసే సీన్.. కట్ చేస్తే.. టైటిల్ కార్డ్.

ఆ తర్వాత... మళ్లీ మల్లె పూలు వేసుకుని పూలరంగడిలా కనిపించాడు సూపర్ స్టార్.  ఆ వెంటనే... వై అంటూ కీర్తి సురేశ్ అడగటం.. దానికి మహేష్ ఇట్స్ ఎ బోయ్ థింగ్ అంటూ.. రిప్లై ఇవ్వటం... ఆ వెంటనే సర్కారు వారి పాట టైటిల్ కార్డ్ పడటం.

 

ఇటీవల కట్ చేసిన ట్రైలర్స్‌లో ఇదో బెస్ట్ ట్రైలర్ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ రివీల్ చేశారు. అద్భుతమైన డైలాగులున్నాయని చెప్పేశారు. అందమైన కీర్తి సురేష్ హిరోయిన్. వెన్నెల కిశోర్‌తో అద్భుతమైన కామెడీ ట్రాక్‌. పవర్‌ఫుల్ విలన్‌గా సముద్ర ఖని. అన్నింటికంటే పవర్‌ఫుల్‌గా సబ్జెక్ట్. బాయ్‌కాట్ బ్యాంక్స్‌ అంటూ బీచ్‌లో కనిపించిన సైకత శిల్పం మూవీ లైన్ ఎంత సీరియస్ సబ్జెక్ట్‌తో కూడిందో అర్ధమవుతోంది. మహేష్‌బాబు, కీర్తి సురేష్‌ హిరోహిరోయిన్లుగా పరుశురమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సర్కారు వారి పాట మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. తాజాగా ట్రైలర్ మాంచి హైప్ క్రియేట్ చేస్తోంది. మహేశ్ బాబుకు హ్యాట్రిక్ హిట్ పక్కా అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.

 Also Read : Rashmika gym Video: జిమ్ లో తెగ కష్టపడుతున్న రష్మిక మందన్నా, వీడియో వైరల్

Also Read : Mithun Chakraborthy: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్‌ చక్రవర్తికి అస్వస్థత... ఆస్పత్రిలో చేరిక!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News