SVP Pre Release Event: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' అప్‌డేట్... ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..?

SVP Pre Release Event:  'సర్కారు వారి పాట' సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు-పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 07:54 AM IST
  • సర్కారు వారి పాట అప్‌డేట్
  • మహేష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్...?
  • నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే ఛాన్స్...
SVP Pre Release Event: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' అప్‌డేట్... ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..?

SVP Pre Release Event: మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట' కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది వారిలో ఎగ్జయిటింగ్ మరింత పెరిగిపోతోంది. సూపర్ స్టార్ మహేష్‌ బాబును ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని తహతహలాడిపోతున్నారు. సిల్వర్ స్క్రీన్ కన్నా ముందు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ మాటలు వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది.

సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మే 7న నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికైతే మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. నేడు లేదా రేపు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన తర్వాతే ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై స్పష్టత రానుంది.

సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి ఇవాళ (మే 5) సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇది తొలిసారి అని చెప్పడంతో... ఆ బిగ్ సర్‌ప్రైజ్‌పై అందరిలో క్యురియాసిటీ నెలకొంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బహుశా మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారేమోనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.

కాగా, మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. గీత గోవిందం తర్వాత పరశురామ్ తెరకెక్కించిన చిత్రం కావడం... ఇప్పటికే విడుదలైన ట్రైలర్, మహేష్ లుక్స్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ అంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Saroor Nagar Honour Kiling: హైదరాబాద్‌లో పరువు హత్య... నడిరోడ్డుపై గడ్డపారలతో దాడి... యువకుడు అక్కడికక్కడే మృతి...

Also Read: Horoscope Today May 5 2022: రాశి ఫలాలు... ఆ రంగాల్లో ఉన్న ఆ రాశి వారు బాగా రాణిస్తారు...  
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News