Prabhas - Sandeep Reddy Vanga: తెలుగు దర్శకులు మరోసారి ప్యాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. గతంలో చాలా మంది తెలుగు దర్శకులు ప్యాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటినా.. ఇంతగా పేరు సంపాదించలేకపోయారు. ఇక 'యానిమల్' అంతకు ముందు 'కబీర్ సింగ్' మూవీలతో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో జెండా పాతాడు. లాస్ట్ ఇయర్ చివర్లో రణ్‌బీర్ కపూర్‌తో చేసిన 'యానిమల్' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో 'స్పిరిట్' మూవీ చేయబోతున్నాడు.
తాజాగా జరిగిన ఈ సినిమా ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమా టైటిల్ చూసి ఇదేదో దెయ్యం మూవీ కాదు.. పూర్తిగా పోలీస్ నేపథ్యంలో తెలంగాణలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్నట్టు మీడియా చెప్పాడు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
విడుదలకు ముందే సినిమా స్టోరీ లీక్ చేస్తావా అంటూ సందీప్ రెడ్డి వంగా పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ మీడియాకు చెప్పడం పెద్ద నేరమేమి కాదంటున్నారు. రాజమౌళి తను తీయబోయే ప్రతి సినిమా స్టోరీని ముందుగా ప్రేక్షకులకు చెప్పడం ఎప్పటి నుంచో వస్తోంది. ముందుగా స్టోరీ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆ సినిమా ఎలా ఉండబోతుందనే ఓ అంచనాకు వస్తారు. మరోవైపు ప్రభాస్‌తో 'కల్కి' మూవీ తెరకెక్కిస్తోన్న నాగ్ అశ్విన్ కూడా.. ఈ సినిమా మహాభారతంతో మొదలై 2898 ADతో ముగుస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు నాగ్ అశ్విన్ ముందుగానే చెప్పి ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు.
ఇక ప్రభాస్ ఇతర సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'సలార్' మూవీతో పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఈయన త్వరలో 'కల్కి'మూవీతో పలకరించనున్నాడు. ఆ తర్వాత 'ది రాజాసాబ్', మంచు విష్ణు 'కన్నప్ప'తో మూవీలున్నాయి. అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ఘార్ధ్ ఆనంద్ మూవీ ఉండనే ఉంది. అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. అటు సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ స్పిరిట్ మూవీ తర్వాత 'యానిమల్ పార్క్' మూవీ చేయనున్నట్టు చెప్పారు. అటు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలతో మూవీలు చేయనున్నాడు.
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter