Jr Ntr, Samantha: జూనియర్ ఎన్టీఆర్, సమంత కాంబోలో..

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌తో ( RRR movie shooting ) బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్‌ - ఎన్టీఆర్‌ల కాంబోలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అరవింద సమేత లాంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ( Trivikram direction ) యంగ్ టైగర్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

Last Updated : Oct 21, 2020, 04:35 AM IST
Jr Ntr, Samantha: జూనియర్ ఎన్టీఆర్, సమంత కాంబోలో..

Samantha to play female lead in Jr Ntr's next: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సమంత ఇప్పటివరకు బృందావనం, రామయ్యా వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్ చిత్రాల్లో కలిసి నటించారు. అందులో రెండు సినిమాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని మెప్పించగా మరో రెండు చిత్రాలు కొంత నిరాశపర్చాయి. ఆ రెండు సినిమాలు కూడా కమెర్షియల్‌గా నిరాశపర్చినప్పటికీ.. ఎంటర్‌టైన్మెంట్ పరంగా ఎన్టీఆర్, సమంత అక్కినేని ఫ్యాన్స్ అందరికీ నచ్చిన సినిమాలే. ఇదిలావుండగా తాజాగా వీళ్లిద్దరి కాంబోలో ఐదో సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.

అరవింద సమేత మూవీ ( Aravinda Sametha movie ) తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయనున్నట్టు ఎప్పటి నుంచో వార్తలొస్తున్న విషయం తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో సమంతనే హీరోయిన్‌గా ( Samantha Akkineni ) తీసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ టాక్. ఈ మేరకు సమంతతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు తెలుస్తోంది. Also read : Radhe Shyam Music director: రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇతడేనా ?

అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని త్రివిక్రమ్ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేయనున్నాడట. సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలన్నీఅమెరికాలోనే షూట్ చేయనున్నట్టు టాక్. 

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌తో ( RRR movie shooting ) బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్‌ - ఎన్టీఆర్‌ల కాంబోలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అరవింద సమేత లాంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ( Trivikram direction ) యంగ్ టైగర్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. Also read : Hyderabad Floods: వరద బాధితుల కోసం టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు.. సాయం చేయాలంటూ పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News