Samantha Struggle Life: డబ్బుల్లేక ఒక్క పూట భోజనం చేసేదాన్ని.. రూ. 500 కోసం ఆ పనులు చేశానన్న సమంత!

Samantha Tough Life: సినిమాల్లోకి రాక ముందు సమంత చాలా కష్టాలు పడింది. ఒక్క పూటనే భోజనం చేస్తూ రెండు నెలలు గడిపిన సామ్‌.. ఇలాంటి కష్టాలు తన లైఫ్‌లో చాలా ఎదుర్కొన్నాని చెప్పింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 08:43 PM IST
  • వరుస సినిమా ఆఫర్స్‌తో దూసుకెళ్తోన్న సమంత
  • సినిమా ఇండస్ట్రీకి రాక ముందు చాలా ఇబ్బందులు పడ్డ సామ్
  • డబ్బు లేకపోవడంతో చదువు మానేసిన సమంత
  • వెల్‌కమ్‌ చెప్పే గర్ల్‌గా పని చేసిన సామ్
Samantha Struggle Life: డబ్బుల్లేక ఒక్క పూట భోజనం చేసేదాన్ని.. రూ. 500 కోసం ఆ పనులు చేశానన్న సమంత!

Samantha life Journey: సమంత ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్స్‌తో టాలీవుడ్‌లో దూసుకెళ్తోంది. అలాగే బాలీవుడ్‌లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకుంది సామ్. (Sam) ఇండస్ట్రీకి రాక ముందు చాలా మంది స్టార్స్‌ చాలా ఇబ్బందులు పడే ఉంటారు. ఇక సమంత కూడా సినిమా ఇండస్ట్రీకి రాక ముందు చాలా కష్టాలను ఎదుర్కొందట. తాజాగా ఒక కార్యక్రమంలో సమంత (Samantha) తాను పడ్డ స్ట్రగుల్స్‌ గురించి చెప్పింది. 

తాను చదువులో టాపర్‌‌నని చెప్పిన సామ్.. డబ్బు లేకపోవడంతో చదువు మధ్యలోనే మానేయాల్సి వచ్చిందని వివరించింది. ఇక సినిమా ఇండస్ట్రీకి రాక ముందు పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్స్‌కు వెల్‌కమ్‌ చెప్పే గర్ల్‌గా (Welcome Girl) పని చేశానని సమంత చెప్పింది. అలా పని చేయడం వల్ల తనకు రోజుకు 500 రూపాయలు ఇచ్చేవారని సామ్ చెప్పుకొచ్చింది.

ఇక కొన్ని సమయాల్లో డబ్బు లేకపోవడంతో ఒక్క పూటనే తినేదాన్ని అని సమంత బాధపడింది. అలా రెండు నెలలు పాటు గడిపానని సమంత చెప్పింది. ఏదో చిన్నాపాటి సంపాదన కోసం మోడలింగ్‌ (Modeling) చేద్దామనుకున్న సమయంలో తనను తన కుటుంబసభ్యులే నీకు ఇది అవసరమా అంటూ వెనక్కి లాగారని సమంత పేర్కొంది. 

ఇక కొన్ని రోజుల కిత్రం కూడా సమంత గతంలో తాను చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పింది. తన ఫ్రెండ్స్‌, డాక్టర్స్‌ సాయంతో ఆ సమస్య నుంచి బయటపడ్డానని పేర్కొంది. కాగా సమంత (Samantha) ఇటీవల పుష్ప (Pushpa) మూవీలో ఐటెమ్‌ సాంగ్‌తో అరించింది. అలాగే యశోద, శాకుంతలం, ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ తదితర మూవీల్లో సమంత నటిస్తోంది. అలాగే సిటాడెల్‌ వెబ్ సీరిస్‌లో కూడా సామ్‌ (Sam) నటిస్తోంది.

Also Read: Asaduddin Owaisi: 'జెడ్​ సెక్యూరీటీ అవసరం లేదు.. ఏ క్యాటగిరీలోనే ఉంటా'

Also Read: IND vs WI: ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం.. ప్రేక్షకులను అనుమతించం! వారికి మాత్రమే ప్రవేశం: గంగూలీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News