Samantha: సమంతను ఇంకా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు.. కారణం అదేనా..

Samantha Health: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత పూర్తిగా కోలుకుందని అనుకుని ఫ్యాన్స్ సంతోషించేలోపే సమంత చేసిన పోస్ట్ అందరికీ షాక్ ఇచ్చింది. సైడ్ ఎఫెక్ట్స్ నుంచి సమంత ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆమె పోస్ట్ చూస్తే తెలుస్తోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 8, 2024, 02:56 PM IST
Samantha: సమంతను ఇంకా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు.. కారణం అదేనా..

Samantha Health Update: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ ని ఏలిన సమంత విడాకుల తర్వాత మాత్రం వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సినిమాల సంగతి పక్కన పెడితే మయోసైటిస్ అనే ఒక అరుదైన డిసార్డర్ తో సమంత చాలా కాలంగా పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలు నుంచి కూడా బ్రేక్ తీసుకొని మరీ ట్రీట్ మెంట్ చేయించుకుంది. 

ట్రీట్ మెంట్ జరుగుతున్న సమయంలో సమంత ఫోటోలు చూసి..అభిమానులు సైతం కంటతడి పెట్టుకున్నారు. చాలా కాలం సైడ్ ఎఫెక్ట్స్ తో కూడా బాధపడిన సమంత గత కొంతకాలంగా మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది. ఖుషి సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా సిటాడెల్ అనే.. వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో అందరూ సమంత ఆరోగ్యం.. మళ్ళీ కుదుటపడిపోయింది అని ఊపిరి పీల్చుకున్నారు. 

కానీ తాజాగా సమంత చేసిన ఒక పోస్ట్ మళ్ళీ అభిమానులకి షాక్ ఇచ్చింది. సమంత చేసిన పోస్ట్ చూస్తే ఆమె ఇంకా ట్రీట్ మెంట్.. తీసుకుంటూనే ఉందని, సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడటం కోసం..అధునాతన వైద్య విధానాలను కూడా అనుసరిస్తున్నారని తెలుస్తోంది. మయోసైటిస్ నుంచి బయటపడటం కోసం.. సమంత బోలెడు మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తోందట. 

ఆ మందుల కారణంగా తన ఆరోగ్యంతో పాటు.. అందం కూడా దెబ్బతింటుంది కాబట్టి.. సమంత ఈ విధానాలను పాటిస్తోందట. అందులో భాగంగానే క్రియో థెరపీ, ఐస్ బాత్ టబ్, న్యూరా నెర్డ్, ఇన్ఫ్రా రెడ్ సానా, ఎల్ఈడి లైట్ థెరపీ వంటి చికిత్స విధానాలను పాటిస్తోంది అని సమాచారం. అయితే సమంత ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది మళ్లీ ఆమెను వరుసగా సినిమాల్లో చూడొచ్చు అని ఆనందంలో ఉన్న అభిమానులకు.. సమంత పోస్ట్ మళ్ళీ ఆందోళన కు గురి అయ్యేలా చేస్తుంది. సమంత పూర్తిగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. 

ఇక సినిమాలో పరంగా చూస్తే సమంత ఈ మధ్యనే సొంతంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. తన సొంత నిర్మాణ బ్యానర్ లో ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాని కూడా తీస్తున్నారు

Also Read:ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై వైద్యం?

Also Read:ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావుపై మెగాస్టార్ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News