Shaakuntalam 3D Trailer: విజువల్ వండర్లా శాకుంతలం.. 3D ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్!

Shaakuntalam Telugu 3D Trailer Talk: సమంత హీరోయిన్ గా తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అవుతున్న క్రమంలో 3D ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 28, 2023, 07:50 PM IST
Shaakuntalam 3D Trailer: విజువల్ వండర్లా శాకుంతలం.. 3D ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్!

Shaakuntalam 3D Trailer Talk: సమంత హీరోయిన్ గా రూపొందుతున్న తాజా చిత్రం శాకుంతలం. దుష్యంతుడు, శకుంతల ప్రేమ కథను అద్భుతమైన దృశ్యకావ్యంగా గుణశేఖర్ తెరకెక్కించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దానికి గుణశేఖర్ అండ్ టీం ఎక్కువగా చెప్పిన కారణం ఈ సినిమా త్రీడీలో చూపిస్తేనే ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి సినిమా విడుదల వాయిదా పడిన పర్వాలేదు 3d ఎఫెక్ట్స్ కోసం మరింత సమయం తీసుకుంటామని చెబుతూ వచ్చారు.

అయితే ఎట్టకేలకు 3d పని కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదల ఎందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో పాటు 3d ట్రైలర్ను కూడా ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియాకు ఎక్స్క్లూజివ్గా ప్రదర్శించారు. ఇక ఈ ట్రైలర్ చూసిన మీడియా ప్రతినిధులంతా సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత, శకుంతల పాత్రలో కనిపిస్తూ ఉండగా దుష్యంతుని పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపిస్తున్నారు.

ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వంటి వారు ఇతర కీలక పాత్రలు నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగా తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నారు. సాధారణంగా దిల్ రాజు సినిమా రిలీజ్ చేస్తున్నారంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. దాంతో పాటు యశోద తర్వాత సమంత నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సంధర్భంగా నవంబర్ లోనే ఫైనల్ కాపీ రెడీ అయిందని కానీ ఇది 3D లో రిలీజ్ చెయ్యాలి అని పట్టుబట్టి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే 6 నెలలు టైం పడుతుంది అన్నారని, ఈ గ్యాప్ లో మా బడ్జెట్, ఇంటరెస్ట్ అన్నీ పెరిగిపోయాయని అన్నారు. 
Also Read: Wines Bandh: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆరోజు మొత్తం వైన్స్ బంద్

Also Read: Ravanasura Trailer: ఆసక్తి రేకెత్తిస్తున్న రావణాసుర ట్రైలర్‌.. రవితేజ మార్క్ మాస్ ఇది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News