Samantha Uterus News: రెస్ట్ మోడ్ లో సమంత.. గర్భ సంచి తొలగించారా?.. అసలు ఏమైందంటే?

Samantha Ruthprabhu Team Responds on Wild Rumors on her uterus: సమంత గురించి జరుగుతున్న ఒక దారుణమైన ప్రచారం గురించి ఆమె పీఆర్ టీం స్పందించినట్టు తెలుస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 5, 2022, 11:17 AM IST
Samantha Uterus News: రెస్ట్ మోడ్ లో సమంత.. గర్భ సంచి తొలగించారా?.. అసలు ఏమైందంటే?

Samantha Ruthprabhu Team Responds on Wild Rumors on her uterus: తెలుగులో ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారింది. కెరీర్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న తర్వాత తన మొదటి సినిమా హీరో అయిన నాగచైతన్యను ప్రేమించి పెద్దలను ఒప్పించి ఆమె వివాహం చేసుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ నాగ చైతన్య, సమంత మధ్య అంతగా సంబంధాలు బాలేదని, ముందు నుంచి ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఊతమిస్తూనే  వారు విడాకులు కూడా అధికారికంగా ప్రకటించారు.

అయితే విడాకుల తర్వాత కూడా సమంత గురించి గానీ నాగచైతన్య గురించి గానీ ఎలాంటి వార్త వచ్చినా కూడా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ వస్తోంది. అయితే సమంత గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అనేక పుకార్లు తెరమీదకు వచ్చాయి. ముఖ్యంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుందని కొంతమంది పుకార్లు పుట్టిస్తే మరి కొంత మంది ఏకంగా సమంత తల్లి ఆమెను రెండో వివాహం చేసుకోమని పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో దాన్నుంచి తప్పించుకోవడం కోసం సమంత తన గర్భసంచి కూడా తొలగించుకుందనే పుకారు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది.

అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు సమంత నుంచి గాని సమంత టీం నుంచి గాని ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో సాధారణ ప్రేక్షకులు కూడా ఈ ప్రచారం నిజమేనని భావించారు. కానీ తాజాగా సమంత టీం ఈ విషయం మీద స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సమంత రెస్ట్ మోడ్ లో ఉన్నారని ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని ఈ పుకార్లు ఏవి నిజం కాదని త్వరలోనే వీటిపై ఆమె అధికారికంగా స్పందిస్తారని వారు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూలై చివరిలో ఆమె ఖుషీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఆ షూటింగ్ షెడ్యూల్ పూర్తయిపోవడంతో అప్పటి నుంచి ఆమె మీడియా కంట పడలేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఏ మాత్రం యాక్టివ్గా లేకపోవడంతో ఆమెకు ఏదో జరిగిందని ప్రచారం మొదలైంది. అది ఏకంగా ఆమె గర్భసంచి తొలగించారనే ప్రచారం వరకు సాగింది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి సమంత చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఆమె శాకుంతలం, యశోద అనే సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది.

అలాగే ఖుషి సినిమా షూటింగ్ 70% పూర్తయింది. ఇక ఆమె అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే ఒక హాలీవుడ్ మూవీలో నటిస్తోంది అలాగే ఫ్యామిలీ మెన్ దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్న  రాజ్ అండ్ డీకే ఎవరైతే ఉన్నారో వారి దర్శకత్వంలో సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా సమంత నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆమె ఈ షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సమయంలోనే ఈ ప్రచారానికి బ్రేక్ ఇచ్చే లాగా సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా లేదా ట్విట్టర్ వేదికగా ఒక నోట్ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read: Janhvi Kapoor Short Dress Photos: పొట్టి బట్టల్లో అందాలు ఆరబోస్తున్న జాన్వీ కపూర్.. నెవర్ బిఫోర్ అంతే!

Also Read: Keerthy Suresh Sizzling Photos: మళ్లీ రెచ్చిపోయిన కీర్తి సురేష్.. హాట్ ట్రీట్ చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News