Samantha Health Update: మళ్లీ అనారోగ్యం బారిన పడ్డ సమంత.. శాకుంతలం ప్రమోషన్స్‌కు డుమ్మా

Samantha Health Update: సమంత మయోసైటిస్‌ నుంచి కోలుకుంది. కానీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. కంటి మీద లైట్ కూడా ఎక్కువ పడితే తట్టుకోలేదట. అందుకే కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతోందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 02:41 PM IST
  • నెట్టింట్లో సమంత సందడి
  • రెండ్రోజుల్లో థియేటర్లోకి శాకుంతలం
  • హెల్త్ బాగా లేదన్న సమంత
Samantha Health Update: మళ్లీ అనారోగ్యం బారిన పడ్డ సమంత.. శాకుంతలం ప్రమోషన్స్‌కు డుమ్మా

Samantha Health Update:  సమంత ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్స్‌ అంటూ బిజీగా ఉంటోంది. యాడ్స్ కూడా చేస్తోంది. అయితే మయోసైటిస్ కారణంగా ఓ ఆరెడు నెలలు బయటకు రాని సమంత ఇప్పుడిప్పుడే యాక్టివ్ అయింది. వర్కౌట్లు చేస్తోంది. మొక్కులు తీర్చుకునేందుకు గుడి మెట్లు కూడా ఎక్కేస్తోంది. వరుసగా సినిమా షూటింగ్‌లు చేస్తోంది. శాకుంతలం సినిమాను దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కూడా సమంత డేట్లు కేటాయించింది. అయితే ఇప్పుడు సమంత ఈ ప్రమోషన్స్ కోసం అటూ ఇటూ తిరగడం వల్ల అనారోగ్యం బారిన పడ్డట్టు తెలుస్తోంది.

ఈ వారం అంతా కూడా నా శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండాలని, మీ ప్రేమలో తడిసి ముద్దవ్వాలని అనుకున్నాను.. కానీ బిజీ షెడ్యూల్స్, ప్రమోషన్స్ కోసం అటూ ఇటూ తిరగడం, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడంతో నాకు ఫీవర్ వచ్చింది.. నా వాయిస్ కూడా పోయింది.. ఈ రోజు మల్లారెడ్డి కాలేజ్లో జరిగే ఈవెంట్లో శాకుంతలం టీం రాబోతోంది.. మీరంతా వెళ్లండి.. మీ అందరినీ నేను మిస్ అవుతున్నాను అని సమంత ట్వీట్ వేసింది.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

సమంత శాకుంతలం సినిమా ఇప్పటికే ప్రీమియర్ వేశారు. ఈ ప్రీమియర్ షోతో సినిమాకు పెద్ద దెబ్బ పడ్డట్టుగా కనిపిస్తోంది. శాకుంతలం సినిమా ఏమీ బాగాలేదని తేలిపోయింది. సమంత డబ్బింగ్ మైనస్ అయిందని, వీఎఫ్ఎక్స్ బాగా లేదని, స్లో నెరేషన్‌తో బోర్ కొట్టించారని తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడం కష్టంగానే అనిపిస్తోంది.

సమంత ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తోంది. శాకుంతలం సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేసేందుకు సమంత ప్రయత్నిస్తోంది. ఆరోగ్యం బాగా లేకపోయినా సమంత తన సినిమా కోసం బయటకు వచ్చి ప్రమోషన్స్ చేస్తోంది. అయితే జ్వరం రావడం, గొంతు సమస్య రావడంతో ప్రమోషన్లకు దూరంగా ఉంటోందట. ఇక సినిమా విడుదలకు రెండు రోజులే ఉండటం, సమంత ఇలా అనారోగ్యం బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News