Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!

Samantha Cries about her Health Condition: కొన్నిరోజుల క్రితం అనారోగ్యం గురించి బయటపెట్టిన సమంత ఇప్పుడు మరోమారు తన అనారోగ్య పరిస్థితి గురించి తాజాగా ఇంటర్వూలో చెబుతూ కన్నీటి పర్యంతం అయింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 8, 2022, 10:22 AM IST
Samantha Cries: అంతా అయిపోయింది అనిపించింది.. అరుదైన వ్యాధి గురించి చెబుతూ ఏడ్చేసిన సమంత!

Samantha Cries while Talking about her Health Condition: తాను మయూసైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన, అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని హీరోయిన్ సమంత కొద్ది రోజుల క్రితం వెల్లడించి అందరిని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. టాలీవుడ్ లోని బడా హీరోలు సైతం ఆమె అనారోగ్యం నుంచి తిరిగి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. ఇక సమంత అభిమానులైతే ఒక రకంగా తీవ్ర నిర్వేదంలో కూరుకు పోయారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని వారంతా ప్రార్థనలు కూడా చేస్తున్నారు.

ఈ సందర్భంగా యశోద సినిమా రిలీజ్ కి దగ్గరైన నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ రిలీజ్ అయింది. నవంబర్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. యాంకర్ సుమతో సమంత చేసిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో తన అనారోగ్య పరిస్థితి గురించి సమంత మరో సారి పెదవి విప్పింది. తాను తన అనారోగ్య పరిస్థితి గురించి పోస్టులో పెట్టిన విధంగానే కొన్ని రోజులు మంచి రోజులని కొన్ని రోజులు చెడ్డ రోజులని చెప్పుకొచ్చింది.

ఒక్కొక్క రోజు తాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని అలా వేస్తే ఇంకా అంతా అయిపోతుంది అనిపిస్తుందని ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇన్ని దాటి వచ్చానా అని అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంది. నేనిక్కడ ఫైట్ చేయడానికి ఉన్నానని సమంత పేర్కొంది.  ఈ సందర్భంగా సుమా మాట్లాడుతూ మీరంటే నాకు చాలా ఇష్టం అని నేను గత కొన్నేళ్లుగా మన ప్రయాణంలో చూస్తూనే ఉన్నాను ఇప్పుడంటే బయటకు చెప్పారు బయటకి చెప్పని సమయంలో కూడా మీరు ఈ వ్యాధితో పోరాడుతూ ఎంత నొప్పి అనుభవించారో నాకు తెలుసు అని అంటే నేనొక్కదాన్నే కాదు జీవితంలో ఎన్నో సమస్యలతో పోరాడే వాళ్ళు ఎందరో ఉన్నారని సమంత ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

ఇక చాలా ఆర్టికల్స్ లో తాను చూశానని తాను ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నానని రాశారు కానీ ప్రస్తుతానికి నాకు నేను ఉన్న స్టేజిలో ఇది ప్రాణాంతకమైనది కాదు నేను ఇంకా చావలేదు అంటూ నవ్వేసింది. ఆ హెడ్లైన్స్ అంత అవసరం ఏమీ కాదని ఆమె కామెంట్ చేశారు. అవును నిజమే ఇది కష్టమైన విషయమే కానీ నేనిక్కడ ఉన్నదే ఫైట్ చేయడం కోసం కదా అంటూ ఆమె చెప్పుకొచ్చారు. 
Also Read: Rashmi on Sudigali Sudheer: సుధీర్ తో ప్రేమో? స్నేహమో? ఎందుకు చెప్పాలి.. కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న రష్మి

Also Read: Naga chaitanya - Samantha Divorce: సమంత, నాగచైతన్య విడాకులు రద్దు చేయిస్తున్న నాగార్జున.. అసలు ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News