నయనతారకు సామ్‌ బర్త్‌డే విషెస్‌, నయన్,సామ్ వీడియో వైరల్

Samantha attends Nayanthara's birthday bash : ఈ పార్టీలో స‌మంత తళుక్కుమంది. న‌య‌న్‌ని ప్రేమ‌గా హ‌త్తుకున్న వీడియో ఇప్పడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 06:46 PM IST
  • న‌య‌న‌తార‌ బర్త్‌డే పార్టీలో తళుక్కుమన్న స‌మంత
  • న‌య‌న్‌ని ప్రేమ‌గా హ‌త్తుకున్న వీడియో వైరల్
  • నయనతార చాలా ధైర్యవంతురాలంటూ ప్రశంసలు
నయనతారకు సామ్‌ బర్త్‌డే విషెస్‌, నయన్,సామ్ వీడియో వైరల్

Samantha attends Nayanthara's birthday bash, calls her queen in special note, video viral: న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ జంట‌కు సంబంధించిన వార్త‌లు కోలీవుడ్‌లో నిత్యం హాట్ టాపిక్‌గా ఉంటాయి. తాజాగా న‌య‌న్ ప్రియుడు.. డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్ (Vignesh Shivan) నయనతార పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడు. ఇందులో భాగంగా తాజాగా అర్ధరాత్రే కేక్‌ కటింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఇక ఈ పార్టీలో స‌మంత (Samantha) తళుక్కుమంది. న‌య‌న్‌ని ప్రేమ‌గా హ‌త్తుకున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అభిమానులు మురిసిపోతున్నారు. విఘ్నేష్‌ దర్శకత్వంలో నయనతార (Nayanthara), సమంత, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో కాత్తు వాక్కుల రెండు కాదల్‌ మూవీ తెరకెక్కుతోంది. ఇక నయనతార పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ మూవీ యూనిట్ ఆమె పోషించిన కణ్మణి పాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

 

Also Read : వైరల్: ఎదురుగా పెద్ద మొసలి.. చెప్పు చూపించిన మహిళ.. మొసలి పరుగో..పరుగు..!!

ఇక సమంత, విఘ్నేశ్‌ సమక్షంలో నయన్‌ (Nayan) కేక్‌ కట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు నయనతారను హగ్‌ చేసుకుంది సమంత. ఈ ఫొటోలను పంచుకుంటూ సామ్‌ (Sam) తన పోస్ట్‌లో నయనతారకు బర్త్‌డే విషెస్ తెలిపింది. నయనతార చాలా ధైర్యవంతురాలని అంటూ ప్రశంసలు కురిపించింది సామ్. నయన్‌ గురించి ఆసక్తికర రీతిలో క్యాప్షన్‌ ఇస్తూ రాసుకొచ్చింది. నయనతారను (Nayanthara) క్వీన్ అంటూ సంబోధిస్తూ సామ్ ఈ పోస్ట్ చేసింది.

 

Also Read : ఉప్మాలో 'పాముపిల్ల'...56 మంది విద్యార్థులకు అస్వస్థత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News