Devara: తారక్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'దేవర' రిలీజ్ వాయిదా..! కారణం ఇదే..

Devara Postponement: గత రెండు సంవత్సరాలుగా తారక్ నుంచి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆడియన్స్ కి సమ్మర్ ట్రీట్ గా విడుదల కాబోతున్న చిత్రం దేవర. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షెడ్యూల్ అనుకోని పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. దీని వెనుక కారణమేమిటి? తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 02:25 PM IST
Devara: తారక్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'దేవర' రిలీజ్ వాయిదా..! కారణం ఇదే..

Saif Ali Khan: ఆర్ఆర్ఆర్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించాడు. ఈ నేపథ్యంలో అతని నెక్స్ట్ చిత్రం పై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ సంచలనంగా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీలో కొమరం భీమ్ క్యారెక్టర్ చేసిన ఎన్టీఆర్ నటన విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇంకా ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ మూవీ రాలేదు. ఎన్టీఆర్ ,కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర చిత్రం వచ్చే సమ్మర్ కు విడుదల అవుతుంది అని నందమూరి అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మూవీ షూటింగ్ కి సంబంధించి ఓ చిన్ని వార్త అందరిని కలవరపెడుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర మూవీ సడన్ గా ఆగిపోయింది. ఇటీవల చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉండడంతో సమ్మర్ కి ఈ చిత్రం విడుదల కన్ఫామ్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకమైన రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకలో పాల్గొనడానికి అయోధ్యకు వెళ్లలేక పోయారు. అయితే అనుకోని విధంగా ఈ మూవీ షూటింగ్ లో చిన్న అంతరాయం ఏర్పడింది.

ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రంలో రావణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మంచి నటన కనబరిచి అందరినీ ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో విలన్ గా సైఫ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర షూటింగ్ షెడ్యూల్లో ఫైట్స్ సన్నివేశంలో భాగంగా సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. డాక్టర్ లు అతనికి శస్త్ర చికిత్సను కూడా నిర్వహించారు. ఇప్పుడు సైఫ్ హాస్పిటల్ లో రెస్ట్ తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇంకా మరికొన్ని వారాలు కొనసాగాల్సి ఉన్న దేవర సినిమా షెడ్యూల్ సడన్గా ఆగిపోయింది. సైఫ్ కోలుకున్న తర్వాత కొత్త షెడ్యూల్ తిరిగి ప్రారంభమవుతుంది అని టాక్. దీంతో అభిమానులు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ గ్యాప్ కారణంగా ఎక్కడ మూవీ షూటింగ్ లేట్ అవుతుందో అని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ సమ్మర్ కి విడుదల అవుతుందా లేదా అనే విషయం  ప్రశ్నార్థకంగా మారింది.

Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు

Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News