ఆటోడ్రైవర్‌గా ఫిదా బ్యూటీ సాయిపల్లవి ?

ఆటోడ్రైవర్‌గా మల్టీటాలెంటెడ్ హీరోయిన్‌ సాయి పల్లవి

Last Updated : May 18, 2018, 06:50 PM IST
ఆటోడ్రైవర్‌గా ఫిదా బ్యూటీ సాయిపల్లవి ?

మల్టీటాలెంటెడ్ హీరోయిన్‌గా పేరున్న సాయి పల్లవి తెలుగు, తమిళం సినిమాలతో ఫుల్ బిజీగా వుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి కణం అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం కాగా మరొకటి పడి పడి లేచే మనసు. కణం సినిమా తమిళంలో దియా పేరుతో తెరకెక్కుతోంది. మొదటిసారి సాయిపల్లవిని తమిళ సినీ పరిశ్రమకు పరిచయం చేస్తోన్న సినిమా ఇది. దియా తర్వాత మారి 2, ఎన్జీకే అనే మరో రెండు తమిళ సినిమాల్లో ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసే ఛాన్స్ దక్కించుకుని తమిళంలోనూ బిజీ హీరోయిన్ అయింది. 

తాను నటించిన అన్ని చిత్రాల్లోనూ పర్‌ఫార్మెన్స్ పరంగా మంచి పేరు తెచ్చుకున్న సాయి పల్లవి తమిళంలో ధనుష్ సరసన నటించనున్న మారి 2 సినిమా కోసం ఇప్పుడు ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటోంది. అవును, ఈ సినిమాలో ఓ లేడీ ఆటో డ్రైవర్‌గా నటించనున్న సాయి పల్లవి అందుకోసం చెన్నైలోని బిజీ వీధుల్లో ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటోందట. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రను పర్‌ఫెక్ట్‌గా చేయాలనే తపనతో ఏదో పేరుకే ఆటో హ్యాండిల్ పట్టుకుని షూటింగ్ పూర్తి చేసినట్టు కాకుండా ఏకంగా ఆటో డ్రైవింగే నేర్చుకుంటోందట ఈ ఫిదా బ్యూటీ. 

ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ట్యూన్స్ అందిస్తున్నాడు. 

Trending News