Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!

Vijay Devarakonda Next Movie: వరుస డిజాస్టర్లు అందుకుంటున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతిలో.. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్న.. ప్రాజెక్టు కూడా ఒకటి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. దానికి కారణం సినిమాలో హీరోయిన్ పాత్ర అని సమాచారం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 7, 2024, 09:15 AM IST
Vijay Devarakonda: మరో సెన్సేషనల్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ కానట్టేనా!

Sai Pallavi: ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ కెరియర్ లో పెద్ద చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఏమీ లేవు. ఖుషి సినిమా కూడా హిట్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు. ఇక ఈ మధ్యనే విజయ్ దేవరకొండ నటించిన.. ది ఫ్యామిలీ స్టార్ సినిమా.. గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడానికి తప్ప సినిమా ఇంక దేనికి ఉపయోగపడలేదు.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో వీడీ 12 కూడా ఒకటి. అయితే విజయ్ దేవరకొండ.. రాజా వారు రాణి గారు ఫేమ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా.. దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. దానికి ముఖ్య కారణం సినిమాలో హీరోయిన్. 

మొదటినుంచి డైరెక్టర్ రవి కిరణ్ ఈ సినిమా కోసం సాయి పల్లవినే హీరోయిన్ గా.. ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాని నిర్మిస్తున్న ఎస్ వీ ఎస్ సీ బ్యానర్ లో కూడా సాయి పల్లవి ఫిదా, నాని ఎంసీఏ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ లు అందుకుంది. కాబట్టి దిల్ రాజు కూడా.. పట్టు పట్టి సాయి పల్లవికి కథను చెప్పించారట. కథ, సినిమాలో హీరోయిన్ పాత్ర బాగా నచ్చడంతో.. సాయి పల్లవి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి కాల్ షీట్లు చూసి కన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పిందట. 

కంటెంట్ లేకపోతే.. స్టార్ హీరోలతో సినిమాలకు సైతం నో చెప్పే సాయి పల్లవి విజయ్ దేవరకొండ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమాలో కచ్చితంగా మంచి కథ ఉండబోతోంది అని, హీరోయిన్ పాత్ర కూడా అద్భుతంగా ఉండబోతోంది…అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం పక్కన పడితే విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ మాత్రం.. ఇక ఈ హీరో ఫేమ్ వర్క్ అవుట్ అయ్యే సీన్ లేదని.. అందుకే తన సినిమాలో స్టార్ హీరోయిన్స్ ని తీసుకుంటున్నారని అంటున్నారు. ఎందుకంటే ఖుషి సినిమాకి.. కూడా మార్కెట్ సమంతా వల్లే వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారని కామెంట్ లో పెడుతున్నారు అభిమానులు.

ఇక ప్రస్తుతం సాయి పల్లవి, రణబీర్ కపూర్ తో.. చేస్తున్న రామాయణం షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాబట్టి విజయ్ దేవరకొండ సినిమాకి సాయి పల్లవి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక నిజంగానే సాయి పల్లవి.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంటే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పుకోవచ్చు. 

మరోవైపు విజయ్ దేవరకొండ..రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని లైన్ లో పెట్టారు. సాయి పల్లవి కూడా ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య.. హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: Graduate MLC: పట్టభద్ర ఓటర్ల వెర్రితనం.. ఐ లవ్యూ.. జై రాకేశన్న.. ఫోన్‌ పే నంబర్‌ అంటూ పిచ్చి రాతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News