Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!

Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది. తాజాగా ఇప్పుడు రామాయణ సినిమాలో రన్బీర్ కపూర్ సరసన సీత పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 16, 2024, 11:35 AM IST
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!

Sai Pallavi Remuneration: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాలో సాయి పల్లవి పేరు కూడా ముందే ఉంటుంది. చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ సాయి పల్లవి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి ఆ పాత్రకి ప్రాణం పోయే గల సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. 

ఇక పెరుగుతూ ఉన్న సాయి పల్లవి క్రేజ్ తో పాటు ఆమె రెమ్యూనరేషన్ కూడా తారాస్థాయికి చేరుతున్నట్లు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి బాలీవుడ్ లో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో యానిమల్ స్టార్ రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. 

రన్బీర్ కపూర్ సరసన ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. అయితే బాగా ఛాలెంజింగ్ గా ఉండే ఈ పాత్ర కోసం సాయి పల్లవి భారీ రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసిందట. ఈ సినిమాకి గాను సాయి పల్లవి ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇంటికి తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం. 

అయితే ప్రస్తుతం సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే సాయి పల్లవి త్వరలోనే తన రమ్యునరేషన్ ను మరింత పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కి సిద్ధం అవుతున్న ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే సాయి పల్లవి కూడా బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోతుంది. 

ఇక ఈ సినిమా మీదే సాయి పల్లవి తన ఆశలన్నీ పెట్టుకుంది. యష్ రావణుడి పాత్రలో కనిపించడానికి సిద్ధం అవుతూ ఉండగా, సన్నీ డియోల్ ఆంజనేయుడిగా, రకుల్ ప్రీత్ శూర్పానఖగా కనిపిస్తారని సమాచారం. ఒకవైపు రష్మిక మందన్న, తమన్నా లాంటి హీరోయిన్ లు హిందీ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సాయి పల్లవి కూడా త్వరలోనే ఈ జాబితా లో చేరిపోనుంది.

తెలుగు లో సాయి పల్లవి తాజాగా నాగ చైతన్య హీరో గా తండేల్ సినిమా లో కూడా నటిస్తోంది.

Also read: Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News