Sai Dharam Tej Recovered: మెగా ఫ్యాన్ కు గుడ్ న్యూస్.. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి తేజ్

Sai Dharam Tej Recovered: రెండు నెలల క్రితం హైదరాబాద్ లోని కేబులు బ్రిడ్జి సమీపంలో ప్రమాదానికి (Sai Dharam Tej Accident) గురైన హీరో సాయి తేజ్.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాల బారిన పడిన సాయి తేజ్.. ఇప్పుడు కుటుంబసభ్యుల మధ్య దీపావళి పండుగను జరుపుకొన్నారు. దానికి సంబంధించిన ఫొటోను మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ లో షేర్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 06:25 AM IST
    • గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న హీరో సాయి ధరమ్ తేజ్
    • పూర్తిగా కోలుకొని కుటుంబసభ్యులతో కలిసి పండుగ చేసుకున్న సాయి తేజ్
    • ట్విట్టర్ లో ఫొటో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
Sai Dharam Tej Recovered: మెగా ఫ్యాన్ కు గుడ్ న్యూస్.. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి తేజ్

Sai Dharam Tej Recovered: మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి (Sai Dharam Tej Accident) గురైన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం అనంతరం కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌.. మీడియాకు కన్పించలేదు. అపోలో ఆస్పత్రిలో (Sai Dharam Tej Hospitalized) శస్త్ర చికిత్స చేయించుకున్న సాయిధరమ్‌.. అటు తర్వాత నివాసానికే పరిమితమయ్యాడు. కాగా, కుటుంబ సభ్యులతో కలిసి  దీపావళి వేడుకలు చేసుకున్నాడు సాయిధరమ్‌ తేజ్‌. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు విచ్చేశాడు. 

దీనిపై చిరంజీవి ట్విట్టర్లో స్పందించారు. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘ మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని ట్వీటర్‌ వేదికగా ఫోటోను పోస్ట్‌ చేశారు. అందులో మెగాస్టార్‌ చిరంజీవీ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా.. పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్‌లు (Sai Dharam Tej Cousins) ఉన్నారు.

దీనిపై హీరో సాయి తేజ్ ట్విట్టర్ లో స్పందించారు. "నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి, మీ ప్రార్థనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వ జన్మ సుకృతం" అని ట్వీట్ చేశారు.

Also Read: NTR Undergoes Minor Surgery: ఎన్టీఆర్ కుడి చేతికి మైనర్ సర్జరీ.. ఫొటోలు వైరల్

Also Read: Vikram teaser updates: కమల్ హాసన్ విక్రమ్ టీజర్ వచ్చేస్తోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News