Sachin Tendulkar, Rajinikanth: రజినికాంత్ బర్త్ డే.. సచిన్ టెండుల్కర్ పోస్ట్ వైరల్

Sachin Tendulkar wishes HBD Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. సచిన్ టెండుల్కర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. రజినీకాంత్‌కి సచిన్ టెండుల్కర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన తీరు చూస్తోంటే.. ఆయనంటే సచిన్‌కి ఎంత అభిమానమో ఇట్టే అర్థమైపోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 07:38 AM IST
  • తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై అభిమానం చాటుకున్న సచిన్ టెండుల్కర్
  • తళైవా బర్త్ డే నాడు సచిన్ చేసిన ట్వీట్ వైరల్
  • ఇంతకీ సచిన్ టెండుల్కర్ సూపర్ స్టార్ గురించి అంతగా ఏం చెప్పాడు
Sachin Tendulkar, Rajinikanth: రజినికాంత్ బర్త్ డే.. సచిన్ టెండుల్కర్ పోస్ట్ వైరల్

Sachin Tendulkar, Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి కోలీవుడ్‌లో మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పుకుంటే అది చాలా తక్కువ చేసి చెప్పుకోవడమే అవుతుంది. ఎందుకంటే తమిళ అభిమానులు తళైవా అని ముద్దుగా పిలుచుకునే రజినీకాంత్‌కి మన దేశంలోనే కాదు.. దేశ, విదేశాల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అన్నింటికి మించి కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్న రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖుల్లోనూ రజినీకాంత్‌కి అభిమానించే వారు ఉన్నారు. అందులో ఒకరు యావత్ ప్రపంచం మెచ్చిన క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. సచిన్ టెండుల్కర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. రోబో సినిమాలో చిట్టి అయినా.. శివాజీ: ది బాస్ అయినా.. సినిమా ఏదయినా స్వచ్ఛమైన నటనలో దళపతి అయిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి బర్త్ డే విషెస్ అంటూ సచిన్ టెండుల్కర్ ట్విటర్ ద్వారా తళైవాకు బర్త్ డే విషెస్ అందించారు.

రజినీకాంత్‌కి సచిన్ టెండుల్కర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన తీరు చూస్తోంటే.. ఆయనంటే సచిన్‌కి ఎంత అభిమానమో ఇట్టే అర్థమైపోతోంది. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను పోగేసుకోవడమే కాకుండా.. ఒక ట్రెండ్ సెట్టర్‌గానూ నిలిచారు. మార్షల్ ఆర్ట్స్ ప్రభావం అధికంగా ఉండే జపాన్, మలేషియా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఆస్ట్రేలియా, చైనా లాంటి దేశాల్లోనూ రజినీకాంత్ కి అమితంగా అభిమానించే అభిమానులు ఉన్నారంటే ఆయన సినిమాలంటే వారికి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కోట్లకొద్ది అభిమానులు అభిమానించే సచిన్ టెండుల్కర్ అంతటి వారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఎంతో వినమ్రంగా బర్త్ డే విషెస్ చెప్పిన తీరు రజినీకాంత్  అభిమానునులను ఎంతో ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి : Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు విడుదల కానుంది

ఇది కూడా చదవండి : Golden GLobe 2023 : గోల్డెన్ గ్లోబ్‌ నామినేషన్‌ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి అంతర్జాతీయ అవార్డు రానుందా?

ఇది కూడా చదవండి : Nagababu : జబర్దస్త్ రోజుల నాటి ఫోటోను షేర్ చేసిన నాగబాబు.. గెటప్ శ్రీను కోసం స్పెషల్ పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News