Ram Charan Sukumar Movie: చెర్రీ ఫాన్స్ కు బ్లాస్టింగ్ అప్డేట్.. సుకుమార్ సినిమా షూట్ కూడా మొదలు?

Ram Charan Sukumar Movie : చాలా సైలెంట్ గా సుకుమార్, రామ్ చరణ్ మూవీకి సంబందించిన సినిమా పది నిముషాల షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 3, 2022, 12:08 PM IST
Ram Charan Sukumar Movie: చెర్రీ ఫాన్స్ కు బ్లాస్టింగ్ అప్డేట్.. సుకుమార్ సినిమా షూట్ కూడా మొదలు?

Ram Charan Sukumar Movie Shooting Update: రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. తర్వాత ఆయన చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ప్రస్తుతం ఆయన ఆశలన్నీ శంకర్ సినిమా మీదనే ఉన్నాయి. రామ్ చరణ్ 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అయితే రామ్ చరణ్ 16వ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

కానీ ఇటీవల ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయమేదో అధికారిక ప్రకటన లేదు కానీ దాదాపు క్యాన్సిల్ అవ్వడం అయితే ఖాయం అని తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ 16వ సినిమా ఎవరితో ఉండబోతోంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన 16వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ ఆ సినిమా పూరవ్వగానే ఈ సినిమా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.

నిజానికి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలోనే ఈ విషయాన్ని రాజమౌళి ప్రస్తావించారు కానీ అప్పట్లో అది 16వ సినిమా అవుతుందని ఎవరూ ఊహించలేదు. గౌతం తిన్ననూరి ప్రాజెక్ట్ అప్పటికే ప్రకటించారు కాబట్టి ఈ విషయం పెద్దగా హైలైట్ అవ్వలేదు. అయితే ప్రొడక్షన్ డిజైనర్ సబు సీరిల్ తన తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సుకుమార్ సినిమాకి సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని దాదాపు పది నిమిషాలకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి చేశారని వెల్లడించారు.

ఇక దీంతో అప్పట్లో రాజమౌళి చెప్పిన మాటలను కూడా గుర్తుతెచ్చుకొని మెగా అభిమానులైతే ఒక రకంగా గాల్లో తేలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రంగస్థలం సినిమాతో ఈ ఇద్దరూ సూపర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలో  కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొడతామని ఇప్పటినుంచి అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి మాట్లాడుతూ ఇది చాలా హార్డ్ హిట్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ అని ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇంట్రడక్షన్ సీన్స్ అయితే మీరు చూసి ఉండరని కామెంట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంటే ముందే ఈ షూటింగ్ పూర్తి చేశారని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ తన శరీరాకృతిని చాలా మార్చుకోవాల్సి వచ్చింది. ఆ శరీరాకృతి చూసి ముచ్చట పడిన సుకుమార్ అదే శరీరాకృతితో తన సినిమా ఇంట్రడక్షన్ సీన్స్ ఉండాలని భావించి రాజమౌళిని ఒప్పించి మరీ షూటింగ్ జరిపినట్లుగా ఇప్పుడు వెల్లడయింది. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మెగా అభిమానులు అయితే ఈ విషయం మీద పండుగ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: Hit 2 Teaser : అంచనాలు పెంచేస్తున్న కేడీ.. హిట్ 2 టీజర్ టాక్.. యత్ర నార్యస్తు పూజ్యంతే!

Also Read: Mahesh - Trivikram: మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య వివాదం.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News