NTR 30 Launch: ఎన్టీఆర్ ఫాన్స్ పండుగ చేసుకునే న్యూస్.. ఇంటర్నేషనల్ కవరేజ్ పక్కా!

RRR Team to Attend NTR 30 Launch: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న  నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా లాంచ్ కు ఆర్ఆర్ఆర్ టీం మొత్తం హాజరు కాబోతుందని తెలుస్తోంది. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 20, 2023, 09:49 PM IST
NTR 30 Launch: ఎన్టీఆర్ ఫాన్స్ పండుగ చేసుకునే న్యూస్.. ఇంటర్నేషనల్ కవరేజ్ పక్కా!

RRR Team to Attend NTR 30 Launch: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న  నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాతి సినిమా త్రివిక్రమ్ తో చేస్తాడని అందరూ భావించారు. కానీ త్రివిక్రమ్ సినిమా పక్కన పెట్టి మరి కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయి ఇప్పటికి దాదాపు పది నెలలకు పైగా పూర్తవుతున్న కొరటాల శివ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందంటూ కూడా ప్రచారం జరిగితే అది నిజం కాదని యూనిట్ పలు అప్డేట్స్ ఇస్తూ వచ్చింది.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాని ఫిబ్రవరి రెండో వారంలో ఘనంగా హైదరాబాద్ వేదికగా లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్ కి ఆర్ఆర్ఆర్ ముఖ్యమైన టీమంతా హాజరు కాబోతోందని అంటున్నారు. రాజమౌళి సహా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కీరవాణి వంటి వారు ఈవెంట్ కి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తర్వాత ఆర్ఆర్ఆర్ గురించి పెద్ద ఎత్తున జాతీయ మీడియాలోనే కాదు అంతర్జాతీయ మీడియాలో కూడా కవరేజ్ లభిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ టీమ్ అంతా ఈ సినిమా ఓపెనింగ్ కి హాజరైతే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరింత బూస్ట్ అప్ లభిస్తుందని భావిస్తున్నారు. జనవరి 24వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రకటన ఉంటుంది, ఒకవేళ ఆస్కార్ అవార్డు గనుక ఆర్ఆర్ఆర్ ను వరిస్తే అది ఎన్టీఆర్ సినిమాకు మరింత బూస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాన్నాళ్ళ నుంచి సరైన అప్డేట్ లేదు సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియదు అని బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు ఇది అయితే ఒకరకంగా ఊరట నిచ్చే అంశం అనే చెప్పాలి. కచ్చితంగా ఈ సినిమా కు ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా హాజరైతే ఆ కవరేజ్ వేరే లెవల్ లో ఉంటుందని చెప్పవచ్చు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని కూడా కొరటాల శివ అండ్ కో ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆచార్య భారీ డిజాస్టర్ గా నిలిచిన తర్వాత కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి మధ్య దూరం పెరిగిందని, మెగాస్టార్ చిరంజీవి దర్శకుల గురించి చేసిన కామెంట్స్ అన్నీ కొరటాల శివ గురించే అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ కి ఆయనను తీసుకువచ్చి మా మధ్య ఎలాంటి పొరపాత్యాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ అందుకు సంబంధించిన అధికారిక సమాచారం అయితే లేదు మెగాస్టార్ చిరంజీవి భోళా మనిషి కాబట్టి ఒకవేళ ఆయనను పిలిచిన వచ్చేశారంటూ ఆయన అభిమానులు అయితే కామెంట్ చేస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది అనేది.
Also Read: Akhanda Hindi: 'పఠాన్'ను టార్గెట్ చేయడానికే అఖండను ఇప్పుడు రిలీజ్ చేశారా?

Also Read: Jagapathi Babu For Pushpa: పుష్ప కోసం జగపతి బాబు.. అసలు విషయం ఏమిటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News